దేశీయ మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ నుంచి కొత్తగా 50 ప్లస్ అనే స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఇందులో మెయిన్ కెమెరా 250 MP తో పనిచేస్తుంది. దీంతో ఫోటోగ్రఫీ కావాలని అనుకునే వారికి ఈ కెమెరా కచ్చితంగా ఫోటోలను అందిస్తుంది. ఇందులో ఏఐ ఫీచర్స్ కూడా ఉండడంతో లైటింగ్, కాంట్రాస్ట్ తో కూడిన అద్భుతమైన ఫోటోలను పొందవచ్చు. తక్కువ కాంతి లోను కావలసిన ఫోటోలను అందిస్తుంది. ఫోటోలతోపాటు వీడియో రికార్డింగ్ కోసం కూడా ఈ కెమెరా సపోర్ట్ గా ఉండనుంది. దీనిలో 5,500 mAh బ్యాటరీని చేర్చారు. ఇది 100 W. సపోర్టుతో చార్జింగ్ అవుతుంది. అలాగే ఒకసారి చార్జింగ్ చేస్తే రోజంతా వినియోగించినా కూడా తక్కువ పర్సంటేజ్ తో డౌన్ అవుతుంది. అంతేకాకుండా డౌన్ టైం తక్కువగా ఉండడంతో ఉద్యోగులు, వ్యాపారులకు అనుగుణంగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే బ్యాటరీ ఆప్టిమైజ్ తో ఉండడంవల్ల గేమింగ్, మల్టీ టాస్కింగ్ యూస్ చేసే వారికి సపోర్ట్ గా ఉండనుంది. ఏ కొత్త మొబైల్లో 5G కనెక్టివిటీ వేగవంతంగా ఉండనుంది. బ్లూటూత్, వైఫై, GPS వంటి ఆప్షన్లు ఉండడంతో నెట్వర్క్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఉండనుంది. సుదూర ప్రాంతాల్లోకి వెళ్లినా కూడా నెట్వర్క్ విషయంలో సపోర్ట్ ఇస్తుంది. ఈ మొబైల్ లో స్మార్ట్ ఫీచర్స్ అనుకూలంగా ఉండాలన్నాయి. ఇందులో 16 జిబి వరకు ర్యామ్ ఉండడంతో వేగవంతంగా ఆపరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది.
0 Comments