Ad Code

సాంకేతిక లోపంతో ల్యాండింగ్ గేర్ లేకుండా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన నాసా పైలెట్


మెరికాలోని టెక్సాస్  ఎల్లింగ్టన్ ఎయిర్‌ పోర్టులో మంగళవారం నాసాకు చెందిన అత్యాధునిక WB-57 పరిశోధనా విమానం ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం కారణంతో ల్యాండింగ్ గేర్ పనిచేయలేదు. దీంతో విమానాన్ని చక్రాలు లేకుండానే రన్‌ వే పై పైలెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసాడు. రన్‌ వే పై విమానం కింది భాగంతో దూసుకు వెళ్లిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ల్యాండింగ్ సమయంలో విమానం నేలను తాకగానే భారీ శబ్దం రావడంతో పాటు, కింద నుంచి మంటలు, తెల్లటి పొగలు ఎగసిపడినట్లు వీడియోల్లో కనిపించింది. కొంతదూరం వరకు రన్‌వేపై వెళ్లిన విమానం, వేగం తగ్గి చివరకు క్షేమంగా నిలిచిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఇద్దరు క్రూ సభ్యులు సురక్షితంగా బయటపడటం నిజంగా అదృష్టమే. ఈ ఘటనపై నాసా అధికారికంగా స్పందిస్తూ విమానంలో ఉన్న సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేసింది. ల్యాండింగ్ సమయంలో ఎదురైన మెకానికల్ సమస్యపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని తెలిపాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను చూసిన నెటిజన్లు షాక్‌కు గురయ్యారు.

Post a Comment

0 Comments

Close Menu