Ad Code

చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో కీలక మార్పు : తాత్కాలికంగా చెన్నై బీచ్ రైల్వే స్టేషన్ వరకే పరిమితం


హైదరాబాద్ - చెన్నై ఎగ్మోర్ చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి చెన్నై ఎగ్మోర్ స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా చెన్నై బీచ్ రైల్వే స్టేషన్ వరకు ప్రయాణించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఎక్స్ లో ఓ ప్రకటన పోస్ట్ చేసింది. చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించే వారు ఈ మార్పును గమనించాల్సి కోరింది. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ది పనుల కారణంగా ఈ రైలును తాంబరం స్టేషన్ వరకూ కాకుండా తాత్కాలికంగా చెన్నై బీచ్ రైల్వే స్టేషన్ వరకే పరిమితం చేశారు. దీంతో హైదరాబాద్ నుంచి వివిధ స్టేషన్ల మీదుగా ఈ రైలులో ప్రయాణాలు చేసే వారు తమ టికెట్లను చెన్నై బీచ్ స్టేషన్ వరకే బుక్ చేసునేందుకు అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరే చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 12760 ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకూ చెన్నై బీచ్ వరకూ మాత్రమే ప్రయాణాలు సాగిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు చెన్నై బీచ్ కు ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది. అలాగే తాంబరం స్టేషన్ కు బదులుగా చెన్నై బీచ్ నుంచి బయలుదేరే చార్మినార్ ఎక్స్ ప్రెస్ నంబర్ 12759 మార్పు ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి వచ్చి ఏప్రిల్ 5 వరకూ ఉంటుంది. ఈ రైలు చెన్నై బీచ్ నుంచి సాయంత్రం 6.20కు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu