Ad Code

స్థిరాస్తి విక్రయాలు సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి రావు : సుప్రీంకోర్టు


స్థిరాస్తి విక్రయాలు సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి రావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి గణనీయమైన ఉపశమనం లభించింది. సహారా ఇండియా కంపెనీకి చెందిన 'ఎలిగెంట్ డెవలపర్స్' అనే సంస్థ 2002-2005 మధ్య గుజరాత్, హరియాణా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఉన్న భూములను అవుట్‌రైట్ సేల్ (పూర్తి విక్రయం) రూపంలో విక్రయించింది. ఈ లావాదేవీలను 'రియల్ ఎస్టేట్ ఏజెంటుగా చేసిన సేవలు'గా పరిగణిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటలిజెన్స్ సంస్థపై ₹10.28 కోట్లు సర్వీస్ ట్యాక్స్ విధిస్తూ నోటీసులు జారీ చేసింది. 'ఎలిగెంట్ డెవలపర్స్' ఈ నోటీసులను సవాలు చేస్తూ కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ సర్వీస్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ లో అప్పీలు దాఖలు చేసింది. కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ సర్వీస్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఈ ట్యాక్స్ నోటీసులను రద్దు చేస్తూ, 'భూముల విక్రయం సేవ కింద పరిగణించలేము' అని తేల్చింది. తదనంతరం, సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, కోర్టు కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ సర్వీస్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ తీర్పును సమర్థించింది.


Post a Comment

0 Comments

Close Menu