Ad Code

వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు


విజయవాడ నగరం కుండపోత వర్షాలతో నీట మునిగింది. ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబు వరద ముంపు ప్రాంతాలను బోటులో వెళ్లి పరిశీలించారు. బుడమేరు పొంగి ముంపునకు గురైన సింగ్ నగర్ ప్రాంతానిక వెళ్లి బాధితులను పరామర్శించారు. ఎవరూ అధైర్య పడొద్దని, తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తనను చూసి చేతులూపుతున్న వరద బాధితులను ఉద్దేశించి… 'మీరేమీ బాధపడొద్దు… అన్నీ నేను చూసుకుంటాను' అంటూ సంజ్ఞల ద్వారా స్పష్టం చేశారు. ఇక సింగ్ నగర్ లో గండి పూడ్చడంపై అధికారులతో మాట్లాడారు. ముందు, వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా నివారించాలని సూచించారు. అనంతరం, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కు వచ్చిన చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Post a Comment

0 Comments

Close Menu