Ad Code

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు : రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్


ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో సుదీర్ఘ కాలంగా జైలులో ఉన్న చెవిరెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఏ-1గా ఉన్న రాజ్ కసిరెడ్డి తో కలిసి మద్యం స్కాంలో చెవిరెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్ అభియోగాలు నమోదు చేసింది. జైలు లో ఉన్న చెవిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, కసిరెడ్డి బెయిల్ పిటీషన్ డిస్మిస్ చేసింది. లిక్కర్ కేసులో జూన్ 17వ తేదీన బెంగళూరు లో సిట్ అధికారులు చెవిరెడ్డిని అరెస్ట్ చేసారు. 226 రోజుల తరువాత ఈ కేసులో చెవిరెడ్డికి బెయిల్ దక్కింది. మద్యం కేసులో పలువురు వైసీపీ నేతలను సిట్ అరెస్ట్ చేసింది. ఎంపీ మిథున్ రెడ్డితో సహా పలువురి పాత్ర పైన అభియోగాలు నమోదు చేసింది. ఇదే కేసులో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డికి రెగ్యుర్ బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తాజాగా తిరస్కరించింది. అయితే, అరెస్ట్ నుంచి కొంత కాలం మినహాయింపు ఇచ్చింది. బెయిల్ కోసం ట్రైల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఇక.. ఈ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జైలులో ఉన్న చెవిరెడ్డితో పాటుగా మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు, ఏ-1గా ఉన్న రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది.

Post a Comment

0 Comments

Close Menu