మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ఆయన స్వగ్రామమైన బారామతిలోని విద్యాప్రతిష్ఠాన్ మైదానంలో వేలాది మంది అభిమానులు, కార్యకర్తల సమక్షంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న అగ్రనేతలు నివాళులర్పించేందుకు బారామతికి తరలివచ్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ హాజరై పవార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. శరద్ పవార్, సుప్రియా సూలే, అజిత్ పవార్ కుమారులు పార్థ్, జయ్ పవార్ ఇతర కుటుంబ సభ్యులు ఈ విషాద సమయంలో పాల్గొన్నారు.
0 Comments