ఫిబ్రవరి 1 నుంచి ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ కి కొత్త నియమాలు

Friday, January 30, 2026

000 or more Amazon Pay and MobiKwik will levy a 1% charge on transactions of Rs. 5 business national New rules for ICICI Credit Cards from February 1st paytm

t f B! P L


ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొత్త నియమాలలో ఫిబ్రవరి 1 నుంచి కీలక మార్పులు చేయబోతోంది. ఈ మార్పుల ప్రకారం కొన్ని ఫీచర్లు పూర్తిగా నిలిచిపోనున్నాయి. కొన్నింటిపై కొత్త షరతులు, అదనపు ఛార్జీలు విధించనున్నారు. ఇది లక్షలాది మంది కార్డ్ హోల్డర్ల జేబులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని బ్యాంక్ చెబుతోంది. కొన్ని కార్డులపై అందించే ఉచిత సినిమా టికెట్ ప్రయోజనాన్ని ముగించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుండి బుక్ మై షో ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్‌స్టంట్ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్‌స్టంట్ ప్లాటినం క్రెడిట్ కార్డ్‌పై అందించే కాంప్లిమెంటరీ మూవీ ప్రయోజనం నిలిచిపోనుంది. హెచ్పీసీఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు బీమా చెల్లింపులపై రివార్డ్ పాయింట్లను పొందడం కొనసాగిస్తారు, కానీ పరిమితి రూ.40,000కి విధించారు. ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ సెక్షన్ లో ఖర్చు చేయడం వల్ల కార్డ్ రకాన్ని బట్టి రూ.10,000 నుండి రూ.40,000 వరకు రివార్డ్ పాయింట్లు కూడా లభిస్తాయి. ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో చేసే చెల్లింపులకు ఇప్పుడు 2% రుసుము విధించనున్నారు. అదనంగా, అమెజాన్ పే, పేటీఎం,మోబిక్విక్ వంటి థర్డ్-పార్టీ వాలెట్‌లు రూ.5,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు 1% ఛార్జీ విధించనున్నారు. రవాణాకు సంబంధించిన కొన్ని భారీ చెల్లింపులు కూడా అదనపు ఛార్జీలకు లోబడి ఉంటాయి. ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ సెక్షన్ లో లావాదేవీ రూ.50,000 దాటితే, అదనంగా 1% ఫీజు వసూలు చేయనున్నారు.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ