Ad Code

‘బోర్డర్ 2’ ఉదయం షో ప్రారంభం కావడానికి కొన్ని నిమిషాల ముందు కూలిన సినిమా హాల్ సీలింగ్ !


గుజరాత్‌లోని వల్సాద్‌లోని రాజ్‌హంస్ మల్టీప్లెక్స్‌లో శుక్రవారం  ‘బోర్డర్ 2’  ఉదయం షో ప్రారంభం కావడానికి కొద్ది నిమిషాల ముందు సినిమా హాల్ సీలింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. అదృష్టవశాత్తూ ప్రేక్షకులు ఇంకా హాల్‌లోకి ఎంట్రీ అవ్వకపోవడంతో ఎవరికీ గాయాలు కాలేదు. వెంటనే అలర్ట్ అయిన థియేటర్ సిబ్బంది షోను క్యాన్సిల్ చేసి అందరినీ సురక్షితంగా బయటకు పంపారు. ఈ ఘటన 1997లో ‘బోర్డర్’ సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో ఢిల్లీలోని ఉపహార్ సినిమాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 59 మంది మృతి చెందిన ఘటన  గుర్తుచేసింది. అప్పుడు ప్రాణనష్టం జరిగితే, ఇప్పుడు అందరూ క్షేమంగా బయటపడటం ఊరటనిచ్చే విషయం. ఈ రెండు ఘటనలు థియేటర్ల నిర్వహణ.. భద్రతపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఏదేమైనా, ఆన్-స్క్రీన్ యుద్ధం చూపిస్తున్న ఈ సినిమా, రియల్ లైఫ్‌లోనూ ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడం గమనార్హం.

Post a Comment

0 Comments

Close Menu