వివో ఎక్స్ 200 టీని అధికారికంగా ఇటీవల విడుదల చేసింది. ఇప్పటికే మార్కెట్‌లో X300 సిరీస్ అందుబాటులో ఉన్నప్పటికీ, X200 సిరీస్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని అప్‌గ్రేడెడ్ స్పెసిఫికేషన్లతో ఈ రీఫ్రెష్డ్ మోడల్‌ను వివో తీసుకొచ్చింది. ఈ లాంచ్‌తో, ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లను కొంత తక్కువ ధరలో అందించాలన్న కంపెనీ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. అద్భుతమైన కెమెరా, సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్ , వినూత్నమైన AI ఫీచర్లతో రాబోతున్న ఈ ఫోన్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్‌లో బలమైన పోటీదారుగా నిలుస్తోంది. ఫ్లాగ్‌షిప్ అనుభవాన్ని కొంచెం తక్కువ ధరలో కోరుకునే వినియోగదారులకు ఇది మంచి ఆప్షన్‌గా నిలవనుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది స్టెల్లార్ బ్లాక్, సీసైడ్ లైలాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల AMOLED FHD+ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ స్క్రోలింగ్, గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. LTPO టెక్నాలజీ లేకపోయినా, సన్నని బెజెల్స్‌తో ఫ్లాగ్‌షిప్ లుక్‌ను కలిగి ఉంది. ఇది అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌తో, రెండు వైపులా గ్లాస్ ఫినిష్‌తో ప్రీమియం డిజైన్‌ను అందిస్తుంది. అదనంగా IP68, IP69 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు ఉండటంతో కఠిన పరిస్థితుల్లోనూ భద్రత కల్పిస్తుంది. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 9400+ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది హై-ఎండ్ గేమింగ్, మల్టీటాస్కింగ్‌ను సులభంగా నిర్వహిస్తుంది. Android 16 ఆధారిత OriginOS 6తో ఈ డివైస్ వస్తుంది. vivo ఐదు సంవత్సరాల OS అప్‌డేట్లు, ఏడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లకు హామీ ఇచ్చింది. దీనిలో 6,200mAh భారీ బ్యాటరీను అమర్చారు. ఇది 90W వైర్డ్ ఫ్లాష్ ఛార్జింగ్‌తో పాటు 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా వినియోగానికి సరిపోతుందని కంపెనీ తెలిపింది. ZEISS సహకారంతో రూపొందించిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్‌లో ఉంది. 50MP Sony LYT702 ప్రైమరీ కెమెరా (OIS). 50MP అల్ట్రా వైడ్ లెన్స్, 50MP టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్ జూమ్), సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరా అందించారు. ఈ ఫోన్‌లో 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, అధునాతన 5G కనెక్టివిటీ, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.4 వంటి అన్ని ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
0 Comments