Ad Code

సొంత వాహనాలు ఉన్నవారికి రూ.3000 ఫాస్టాగ్ !


గస్టు 15, 2025న వాహనదారుల కోసం ఈ ప్రత్యేకమైన యాన్యువల్ పాస్ సౌకర్యాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. ఈ పాస్ ధర రూ.3000. దీని ద్వారా ఒక సంవత్సర కాలంలో లేదా 200 ట్రిప్పుల వరకు (ఏది ముందైతే అది) మీరు టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం సొంత వాహనాలు ఉన్నవారికి మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. వాణిజ్య వాహనాలకు ఇది వర్తించదు. ట్రిప్పులు ముగిసిన వెంటనే మళ్ళీ కొత్తగా పాస్‌ను రీ-యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని కోసం రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. యాప్‌లోకి వెళ్లి Add Pass ఆప్షన్ ద్వారా వాహన వివరాలు నమోదు చేసి, పేమెంట్ పూర్తి చేస్తే చాలు. నిమిషాల్లో మీ పాస్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన నిబంధన ఉంది. ఒకవేళ ఏడాది పూర్తయ్యాక కూడా 200 ట్రిప్పుల్లో కొన్ని మిగిలి ఉంటే, అవి వచ్చే ఏడాదికి బదిలీ కావు. సంవత్సరం ముగియగానే పాత పాస్ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. కాబట్టి వినియోగదారులు ట్రిప్పులను ఏడాది లోపే వాడుకోవడం ఉత్తమం. మొదటిసారి యాన్యువల్ పాస్ తీసుకోవాలనుకుంటే, ఎన్‌హెచ్ఏఐ అధికారిక వెబ్‌సైట్ లేదా రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ ద్వారా ఇంట్లో కూర్చునే పని పూర్తి చేయవచ్చు. వాహన రిజిస్ట్రేషన్ నంబర్, వాలిడ్ ఫాస్టాగ్ ఐడీ వంటి వివరాలు ఇచ్చి రూ.3000 చెల్లిస్తే, కేవలం రెండు గంటల్లోనే పాస్ పనిచేయడం మొదలవుతుంది. తరచూ హైవేలపై ప్రయాణించే వారికి, ముఖ్యంగా సిటీ శివార్లలో నివసించే వారికి ఇది నిజంగా వరమే అని చెప్పాలి.

Post a Comment

0 Comments

Close Menu