ఆస్ట్రేలియా ఓపెన్ 2026 సెమీ ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను స్పెయిన్ కు చెందిన ప్రపంచ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్ ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో 6-4, 7-6(5), 6-7(3), 6-7(4), 7-5 తేడాతో అల్కరాజ్ విజయం సాధించాడు. తొలి రెండు సెట్లను అల్కరాజ్ గెలుచుకున్నప్పటికీ.. జ్వెరెవ్ గట్టి పోటీనిస్తూ తర్వాతి రెండు సెట్లను టై బ్రేకర్లలో సొంతం చేసుకున్నాడు. దీంతో విజేతను తేల్చేందుకు ఐదో సెట్‌ను నిర్వహించారు. ఈ మ్యాచ్ మూడో సెట్లో అల్కరాజ్ కుడి కాలికి తీవ్ర గాయమైంది. ఒకానొక దశలో కదలడానికి కూడా ఇబ్బంది పడిన అల్కరాజ్.. మ్యాచ్ మధ్యలోనే వైదొలుగుతాడనే అంతా భావించారు. కానీ అల్కరాజ్ మాత్రం అద్భుతమైన పోరాటం కనబరిచాడు. మెడికల్ టైం అవుట్ తీసుకుని తిరిగి కోర్టులో అడుగుపెట్టాడు. నిర్ణయాత్మక ఐదో సెట్లో 3-5తో అల్కరాజ్ వెనుకబడినప్పటికీ తర్వాత తన మార్క్ షాట్లతో పుంజుకుని సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో అల్కరాజ్.. రెండు సార్లు డిఫెండింగ్ ఛాంపియన్ జానిక్ సినర్ లేదా నోవాక్ జోకోవిచ్‌లతో తలపడే అవకాశముంది. మరోవైపు సెకెండ్ సెమీఫైనల్లో శనివారం జానిక్ సినర్, జోకోవిచ్‌లు తలపడనున్నారు.
3
Beranda
› Australian Open 2026 Alcaraz Reaches the Final
› Carlos Alcaraz defeated Alexander Zverev
› second semi-final on Saturday
› sports
› ఆస్ట్రేలియా ఓపెన్ 2026 : ఫైనల్లో అడుగుపెట్టిన అల్కరాజ్
Subscribe to:
Post Comments (Atom)