Ad Code

బస్సులో అక్రమంగా తరలిస్తున్న ₹10 కోట్ల విలువైన బంగారం పట్టివేత


కేరళ నుండి కోయంబత్తూరు వైపు వస్తున్న తమిళనాడు ప్రభుత్వ బస్సును పోలీసులు ఆపి సోదాలు నిర్వహించారు. కేరళ నుండి వచ్చే ప్రయాణికులు ఎవరైనా నిషేధిత లాటరీ టిక్కెట్లను తరలిస్తున్నారా?అనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో, బస్సులో ఒక వ్యక్తి పెద్ద బ్యాగుతో అనుమానాస్పదంగా కూర్చుని ఉండటం పోలీసులు గమనించారు. ఆ బ్యాగును తెరిచి చూడగా, అందులో భారీగా బంగారు  ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి కేరళలోని ఆలప్పుజ ప్రాంతానికి చెందిన వర్గీస్ కుమారుడు నిబిన్ (29) అని తెలింది. తను పనిచేస్తున్న బట్టల దుకాణం యజమాని రెహమాన్ (42), కోయంబత్తూరు ఉక్కడం ప్రాంతంలోని సురేష్ అనే వ్యక్తికి అందించమని ఈ బంగారు ఇచ్చినట్లు నిబిన్ పోలీసులకు తెలిపాడు. ఎటువంటి ఆధారాలు లేకుండా బంగారాన్ని తరలిస్తున్నందుకు నిబిన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, అతని వద్ద నుండి ₹10 కోట్ల విలువైన సుమారు 6 కిలోల 140 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిబిన్‌ను కోయంబత్తూరు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు.

Post a Comment

0 Comments

Close Menu