Ad Code

రిటైర్మెంట్‌ వెనక్కు తీసుకున్న ఇంగ్లండ్‌ క్రికెటర్ మొయిన్ అలీ


ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ మరోసారి తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. 2021లో టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికి, తిరిగి 2023 యాషెస్‌ సిరీస్‌ కోసం బరిలోకి దిగిన అలీ తాజాగా తన దేశవాలీ రిటైర్మెంట్‌ విషయంలో యూ టర్న్‌ తీసుకున్నాడు. 2025లో ఇంగ్లండ్ డొమెస్టిక్ క్రికెట్‌ నుంచి తప్పుకున్న మొయిన​్‌.. తాజాగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, దేశవాలీ క్రికెట్‌లో కొనసాగేందుకు నిర్ణయించుకున్నాడు. అయితే తన పాత జట్టును కాదని కొత్త జట్టుతో (యార్క్‌షైర్‌) ఒప్పందం చేసుకొని టీ20 బ్లాస్ట్‌, ద హండ్రెడ్‌ లీగ్‌ల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. మిగతా దేశాల ఫ్రాంచైజీ లీగ్‌ల్లో పాల్గొనేందుకు మొయిన్‌ అప్పట్లో దేశవాలీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. తాజాగా ఆ రూల్స్‌ సవరించబడటంతో, దేశవాలీ టీ20 ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు.

Post a Comment

0 Comments

Close Menu