మనం రోజూ వాడే ఉప్పును సాధారణంగా సముద్రపు నీటి నుండి లేదా ఉప్పు గనుల నుండి సేకరిస్తారు. దీనిని అధిక స్థాయిలో శుద్ధి చేస్తారు. ఈ ప్రక్రియలో ఉప్పులోని ఇతర ఖనిజాలు తొలగించబడి, కేవలం సోడియం క్లోరైడ్ మాత్రమే మిగులుతుంది. ఇది గడ్డకట్టకుండా ఉండేందుకు ‘యాంటీ కేకింగ్’ ఏజెంట్లను కలుపుతారు. అయితే, నార్మల్ సాల్ట్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఇందులో అయోడిన్ కృత్రిమంగా కలుపుతారు. ఇది థైరాయిడ్ సమస్యలు రాకుండా కాపాడుతుంది. పింక్ సాల్ట్ అనేది పాకిస్థాన్‌లోని హిమాలయ పర్వత ప్రాంతాల్లోని ఖేవ్రా ఉప్పు గనుల నుండి లభిస్తుంది. ఇది సహజంగానే లేత గులాబీ రంగులో ఉంటుంది. సాధారణ ఉప్పులాగా దీనిని ఎక్కువగా శుద్ధి చేయరు. అందుకే ఇందులో సోడియం క్లోరైడ్‌తో పాటు దాదాపు 84 రకాల ఖనిజాలు స్వల్ప మొత్తంలో ఉంటాయి. ఇందులో ఉండే ఐరన్ ఆక్సైడ్ కారణంగానే దీనికి ఆ గులాబీ రంగు వస్తుంది. ఇది సహజ సిద్ధంగా లభించే ఉప్పు కావడం వల్ల ఆరోగ్య ప్రేమికులు దీనిని ఎక్కువగా ఇష్టపడతారు. సాధారణ ఉప్పులో 97% కంటే ఎక్కువ సోడియం క్లోరైడ్ ఉంటుంది. పింక్ సాల్ట్‌లో కూడా సోడియం క్లోరైడ్ దాదాపు 98% వరకు ఉంటుంది. మిగిలిన 2% లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి. అయితే, ఈ ఖనిజాలు చాలా తక్కువ పరిమాణంలో ఉండటం వల్ల, కేవలం పింక్ సాల్ట్ తింటేనే శరీరానికి కావాల్సిన మినరల్స్ అన్నీ అందుతాయని అనుకోవడం తప్పు. కానీ, కెమికల్ ప్రాసెసింగ్ లేకపోవడం పింక్ సాల్ట్ యొక్క ప్రధాన ప్లస్ పాయింట్. సోడియం పరిమాణం రెండింటిలోనూ దాదాపు సమానంగానే ఉంటుంది. కాబట్టి బీపీ ఉన్నవారు ఏ ఉప్పు వాడినా పరిమితంగానే వాడాలి. అయితే, పింక్ సాల్ట్ సహజమైనది కావడం వల్ల శరీరంలోని ద్రవాల సమతుల్యతను కాపాడటంలో కొంచెం మెరుగ్గా పనిచేస్తుందని కొందరు నిపుణులు చెబుతారు. పింక్ సాల్ట్ లాంప్‌లు లేదా ఉప్పు గదుల ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల ఆస్తమా వంటి సమస్యలు తగ్గుతాయని ఒక నమ్మకం ఉంది. ఆయుర్వేదం ప్రకారం, పింక్ సాల్ట్ (సైంధవ లవణం) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శరీరానికి చలువ చేస్తుంది.
Home
arogyam
ayurvedam
health
Pink salt is obtained from the Khewra salt mines in the Himalayan mountain range of Pakistan.
Rock Salt - Health Benefits
సైంధవ లవణం - ఆరోగ్య ప్రయోజనాలు
Thursday, January 29, 2026
Subscribe to:
Post Comments (Atom)
Follow by Email
If you like Articles on this blog, Please subscribe for free via email.
Liên Kết Bạn Bè
Bình Luận Mới Nhất
Trending
Archive
Updates
Wikipedia
Search results
Comments
Recent
Fashion
News
Food
Sports
Tech News $ Scince latest
Food
Technology
Menu Footer Widget
Featured
Videos
Ticker
6/recent/ticker-posts
Comment
Ad Code
THỐNG KÊ BLOGSPOT
Configure Archive
Search This Blog
Advertisement
Masukkan script iklan 300x600px
Menu Atas
About
Ad Space
Business
Recent Post
About Me
NGƯỜI THEO DÕI BLOG
Topik Populer
Translate
Travel the world
Berita Terbaru
Pages
Pages
স্বাগতম! অনলাইনে ইনকাম, ফ্রিল্যান্সিং, এসইও এবং ডিজিটাল মার্কেটিং এর সকল তথ্য পেতে যুক্ত থাকুন টেক বাংলা ইনফো-এর সাথেই থাকুন।
