Ad Code

రూ.10, రూ.20, రూ.50 నోట్ల కోసం కొత్త ఏటీఎంలు ?


కేంద్ర ప్రభుత్వం చిల్లర సమస్య పరిష్కరించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది. రూ. 100, రూ. 500 నోట్లకు బదులుగా చిన్న నోట్లను పంపిణీ చేయగల కొత్త ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్లను ప్రవేశపెట్టాలని పరిశీలిస్తోంది. అంతేకాదు, ప్రజలు పెద్ద నోట్లను చిన్న నోట్లకు మార్చుకోవడానికి వీలు కల్పించే హైబ్రిడ్ ఏటీఎంలను తీసుకొచ్చే యోచన కూడా ఉందని తెలుస్తోంది. రోజువారీ లావాదేవీల కోసం ఇప్పటికీ నగదుపై ఆధారపడే ప్రజలకు రూ.10, రూ.20, రూ.50 నోట్లను సులభంగా అందుబాటులో ఉంచడమే దీని లక్ష్యం. ఇప్పటికే చిన్న కరెన్సీ నోట్ల కోసం ఏటీఎం యంత్రాలను ముంబైలో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. అక్కడ చిన్న కరెన్సీ నోట్ల లభ్యతను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కనుక విజయవంతమైతే దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్నారు. నివేదిక ప్రకారం స్థానిక మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్ డిపోలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి నగదు వినియోగం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఈ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రదేశాల్లో తరచుగా నగదు లావాదేవీలు జరుగుతాయి. దీని వల్ల కొత్త వ్యవస్థను పరీక్షించడానికి ఇవి అనుకూలంగా ఉంటాయి. ప్రజలకు తరచుగా త్వరగా డబ్బులు మార్చుకోవాల్సిన ప్రదేశాలలో చిన్న నోట్లను సులభంగా అందుబాటులో ఉంచాలనేది దీని ఆలోచన. ఈ కొత్త ఏటీఎం యంత్రాల నుంచి రూ.100, రూ.500 నోట్లతో పాటు రూ.10, రూ.20, రూ.50 నోట్లను కూడా తీసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu