హైదరాబాద్ లోని ఫీర్జాదిగూడలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఉంటున్న పి.ఎల్లం (56) అనే వ్యక్తి జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో అతని భార్య ఆర్ఎంపీ వైద్యుడు లునావత్ రూప్ సింగ్ దగ్గరకు తీసుకెళ్లింది. వైద్య పరీక్షల అనంతరం లునావత్ రూప్ సింగ్ ఎల్లంకు రెండు ఇంజెక్షన్ లు ఇచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే ఎల్లం నోట్లో నుంచి నురగ వచ్చింది. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో అతని భార్య తీవ్ర భయాందోళనకు గురై వెంటనే తన కుమారునికి సమాచారం ఇచ్చింది. ఎల్లంకు నోటి నుంచి నురగలు అలాగే వస్తుండటంతో అతని బోడుప్పల్ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలోనే ఎల్లం మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలను సేకరించారు. నకిలీ ఆర్ఎంపీ లునావత్ రూప్ సింగ్ ను అదుపులోకి తీసుకుని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు దర్యాప్తులో రూప్ సింగ్‌కు ఎలాంటి వైద్య అర్హతలు లేవని తేలడంతో న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్‌కు తరలిలించారు.
0 Comments