సంఘ్ పరివార్‌ను ఓడించడానికి దేశ ప్రజలంతా గాంధీ పరివార్‌కు అండగా నిలవాలి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Friday, September 25, 2026

Chief Minister Revanth Reddy kerala national People across the country must stand by the Gandhi Parivar to defeat the Sangh Parivar receiving the prestigious 'Aryadan Muhammed Best Public Servant' award

t f B! P L

కేరళలో ప్రతిష్టాత్మక 'ఆర్యదాన్ ముహమ్మద్ ఉత్తమ ప్రజాసేవకుడు' పురస్కారాన్ని అందుకున్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ జాతీయ రాజకీయాలు, సమకాలీన పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో రెండు విభిన్న సిద్ధాంత కుటుంబాల మధ్య పోరాటం సాగుతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. "ఒకటి సంఘ్ పరివార్, మరొకటి గాంధీ పరివార్. సంఘ్ పరివార్‌ను ఓడించడానికి దేశ ప్రజలంతా గాంధీ పరివార్‌కు అండగా నిలవాలి" అని ఆయన కోరారు. సంఘ్ పరివార్ వైఖరిని తీవ్రంగా ఎండగడుతూ, వారు కులం, మతం, ప్రాంతం, భాష ఆధారంగా దేశాన్ని అన్ని విధాలుగా విభజించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. దేశ సమగ్రతకు, ప్రజాస్వామ్య మనుగడకు సంఘ్ పరివారే అత్యంత పెద్ద ముప్పుగా మారిందని ఆయన హెచ్చరించారు. భారత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను రక్షించాలంటే ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ