దానం నాగేందర్ పిటిషన్‌ విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు

Monday, September 21, 2026

hyderabad Khairatabad MLA scheduled to hear the petition on the 23rd of this month Supreme Court Agrees to Hear Danam Nagender's Petition telangana

t f B! P L

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. పార్టీ ఫిరాయింపుల కేసులో హైకోర్టు తనపై విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో సోమవారం మెన్షన్ చేశారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈనెల 23న విచారణ చేపట్టనుంది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ దానం నాగేందర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం ఆ పదవిలో ఉంటూనే కాంగ్రెస్ బీ ఫాంతో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆయనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు దానంపై అనర్హత వేటు వేస్తూ తీర్పు చెప్పిన విషయం విదితమే. ఈ తీర్పును సవాల్ చేస్తూ దానం సుప్రీం కోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేశారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ