పెళ్లి విషయంలో మనస్థాపంతో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
Tuesday, September 22, 2026
announced that he was ending his life AR Constable Commits Suicide Over Marriage-Related Distress hyderabad telangana video call to the woman
హైదరాబాద్ లో పెళ్లి విషయంలో మనస్థాపంతో ఏఆర్ కానిస్టేబుల్ యువతికి వీడియో కాల్ చేసి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. మలక్‌పేట పోలీసులు తెలిపిన మేరకు మంచిర్యాల, బెల్లంపల్లికి చెందిన ముత్తా చంద్రశేఖర్ (36) శాలివాహననగర్ డ్రీమ్ హోమ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా అంబర్‌పేట హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్నాడు.ఇటీవల మంచిర్యాలకు చెందిన సమీప బంధువైన యువతితో పెళ్లి కుదిరింది. కొద్ది రోజుల తర్వాత చంద్రశేఖర్ తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్పాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత కూడా ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి యువతికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి బెడ్‌షీట్‌తో గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. యువతి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మలక్‌పేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పెళ్లికి సంబంధించిన సమస్యల కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై సంజీవరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
No comments:
Post a Comment