ఆసియా క్రీడలు : కాంస్యం సాధించిన పురుషుల బ్యాడ్మింటన్ టీమ్
Wednesday, September 23, 2026
against the defending champions Asian Games Indian squad lost to China in the semi-finals Men's Badminton Team Wins Bronze national sports
ఆసియా క్రీడలు-2026 టోర్నీలో పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ సెమీ ఫైనల్లో భారత జట్టు చైనా చేతిలో ఓడిపోయి కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ చైనాతో తలపడ్డ భారత జట్టు ఆరంభంలో అలరించినా ఆ తర్వాత ప్రత్యర్థి ముందు తలొగ్గింది. సింగిల్స్‌లో షి యు కీ చేతిలో లక్ష్య సేన్ 21-16, 21-18 పాయింట్ల తేడాతో ఓడిపోగా.. డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి.. లియాండ్ వెయ్ కెంగ్, వాంగ్ చాంగ్‌లపై 21-11, 22-20 తేడాతో గెలిచారు. మూడో మ్యాచ్‌లో లి షి ఫెంగ్ ఆయుశ్ శెట్టిని 21-19, 21-13 తేడాతో ఓడించగా.. నాలుగో మ్యాచ్‌లో హి ఝి టింగ్, లియూ యీ- హరిహరన్ అమ్సకరుణన్, ఎంఆర్ అర్జున్‌లపై 21-16, 18-21, 21-9 తేడాతో విజయం సాధించారు. దీంతో భారత బ్యాడ్మింటన్ జట్టు చైనా చేతిలో 3-1 తేడాతో ఓటమిపాలైంది. దీంతో భారత్ కాంస్యానికి పరిమితమైంది. కాగా ఆసియా క్రీడల తాజా ఎడిషన్‌లో భారత్ ఇప్పటి వరకు ఒకే ఒక్క స్వర్ణం మాత్రమే గెలిచింది.
No comments:
Post a Comment