3

హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ రీజియన్ ప్రారంభం

హైదరాబాద్​ క్లౌడ్ రీజియన్‌ను మైక్రోసాఫ్ట్ ఇండియా సౌత్ సెంట్రల్ లాంఛనంగా ప్రారంభించింది. ఢిల్లీలో సోమవారం జరిగిన 'మైక్రోసాఫ్ట్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమిట్' సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. భారత్‌లో క్లౌడ్ , ఏఐ రంగాభివృద్ధికి ప్రకటించిన 20.5 బిలియన్ల డాలర్ల పెట్టుబడిలో భాగంగా ఈ డేటా సెంటర్ ఏర్పాటయింది. పుణె, చెన్నై, ముంబై తర్వాత దేశంలో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసిన నాల్గవ  క్లౌడ్ రీజియన్ ఇది. ఆసియా, గ్లోబల్ సౌత్ ప్రాంతాలకు ఇది ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. అదానీ గ్రూప్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే ఈ సేవలను వాడుతున్నాయి. దేశంలో ఏఐ మౌలిక వసతుల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. భారత్‌లో 20 శాతం డేటా ఉత్పత్తి అవుతున్నప్పటికీ కేవలం 3 శాతం డేటా సెంటర్ సామర్థ్యం మాత్రమే అందుబాటులో ఉంది.

Related Post

Previous
Next Post »