About LATEST NEWS AP TO TG

Telugu computer tutorials Unicode to Anu conversion smartphone tips Telugu Use smartwatch tips Telugu EV news Telugu tech upd

Manual Description Here: Ea eam labores imperdiet, apeirian democritum ei nam, doming neglegentur ad vis.

3
Showing posts with label in the increase of IPL teams. Show all posts
Showing posts with label in the increase of IPL teams. Show all posts

ఐపీఎల్ జట్లు పెంపు : అందులో నిజం లేదన్న బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా

ఐపీఎల్ జట్ల సంఖ్యను 10 నుంచి 12కు పెంచుతారనే ప్రచారాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఖండించింది. అసలు అలాంటి ఆలోచనే లేదని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2028 మెగా వేలానికి ముందు లీగ్‌ను 12 జట్లకు విస్తరిస్తారని, ఇందుకోసం పుణె, వడోదర నగరాలను పరిశీలిస్తున్నట్లు గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై స్పందించిన బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అందులో నిజం లేదని చెప్పారు. ప్రపంచ మార్కెట్లో ఐపీఎల్‌కు అద్భుతమైన ఆదరణ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి లీగ్ విస్తరణకు ఎలాంటి అవకాశం లేదని తెలిపారు. ప్రస్తుతం తమ ఫోకస్ అంతా ఐపీఎల్ 2027 సీజన్ నిర్వహణపైనే ఉందని చెప్పారు. 'ఐపీఎల్‌ను 12 జట్లకు విస్తరించాలనే ప్రతిపాదనే రాలేదు. ఈ విషయంపై మేం అధికారికంగా గానీ, అనధికారికంగా గానీ చర్చించలేదు. ఇప్పుడు మా దృష్టంతా ఐపీఎల్ 2027 సీజన్ పైనే ఉంది. ఈసారి ఐపీఎల్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ఇది 20వ సీజన్ కాబట్టి అత్యంత ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఈ సీజన్ ఏర్పాట్లు గురించి తప్ప మరే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఫేక్. వాటిలో ఎలాంటి నిజం లేదు. 'అని సైకియా స్పష్టం చేశారు. ఐపీఎల్ జట్ల పర్స్ విలువను రూ.125 కోట్ల నుంచి 150 కోట్లకు పెంచే విషయంపై కూడా సైకియా వివరణ ఇచ్చారు. 'ప్రస్తుతం ఫ్రాంచైజీల పర్స్ విలువను పెంచడం లేదు. డిసెంబర్ 16న ఐపీఎల్ 2027 మినీ వేలం జరుగుతుంది. ప్రస్తుత సైకిల్‌లో ఇదే చివరి సీజన్. వచ్చే ఏడాది మెగా వేలం జరగనుంది. మెగా వేలానికి ముదే ఫ్రాంచైజీల పర్స్ మనీని పెంచే విషయంపై నిర్ణయం తీసుకుంటాం.'అని సైకియా బదులిచ్చారు. ఐపీఎల్ విండోను జనవరికి మార్చాలనే డిమాండ్లపై మాట్లాడేందుకు సైకియా నిరాకరించారు. ఐపీఎల్ 2027 సీజన్‌ను మార్చి-మే విండోలో నిర్వహించడంపైనే ఫోకస్ పెట్టామని, ఇతర విషయాలపై తాను స్పందించలేనని చెప్పారు. సైకియా వివరణతో ఐపీఎల్‌ విస్తరణపై జరుగుతున్న ప్రచారానికి తెరపడింది.

Read More...