ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా కొల్లూరు మండలం ఇందిరానగర్ కాలనీలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, పెద్ద కుమారుడి వైకల్యం కారణంగా తీవ్ర మనోవేదనకు గురైన ఓ తండ్రి ఇద్దరు కుమారులకు విషం ఇచ్చి, తానూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో తండ్రితో పాటు పెద్ద కుమారుడు ప్రాణాలు కోల్పోగా, చిన్న కుమారుడు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. కొల్లూరు మండలంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన కట్టా రామకృష్ణ (36) స్థానిక గ్రామ పంచాయతీలో చెత్త తరలించే వాహనాన్ని నడుపుతూ జీవనం సాగించేవారు. ఆయన భార్య ఇళ్లలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం భార్యాభర్తలిద్దరూ కష్టపడుతున్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులు వారిని వెంటాడుతున్నాయి. ఇదే సమయంలో రామకృష్ణ కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో వైద్య ఖర్చులు, పిల్లల అవసరాలు తీర్చడం ఆయనకు భారంగా మారినట్లు తెలుస్తోంది. రామకృష్ణ పెద్ద కుమారుడు వినయ్ కుమార్ (13) మూగ, చెవుడు సమస్యలతో బాధపడుతున్నాడు. బాలుడికి వినికిడి పరికరం అవసరం కాగా, దాని ఖరీదు సుమారు రూ.5 లక్షలు అని కుటుంబ సభ్యులు తెలిపారు. అంత మొత్తాన్ని సమకూర్చే ఆర్థిక స్థోమత లేకపోవడంతో రామకృష్ణ తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం. కుటుంబ సమస్యలు, తన అనారోగ్యం, కుమారుడి వైద్య అవసరాలు కలిసి ఆయనపై మానసిక ఒత్తిడిని పెంచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గత నెల రోజులుగా మద్యానికి బానిసైనట్లు స్థానిక సమాచారం. ఈ నెల 6న రామకృష్ణ భార్య పనికి వెళ్లింది. ఇంట్లో పిల్లలు ఉండగా, రామకృష్ణ శీతల పానీయంలో విషపదార్థం కలిపి తాగారు. అనంతరం అదే పానీయాన్ని ఇద్దరు కుమారులకు ఇచ్చారు. వారు కూడా దానిని తాగడంతో కొద్దిసేపటికే ముగ్గురికీ తీవ్ర అస్వస్థత ఏర్పడింది. పని ముగించుకుని ఇంటికి వచ్చిన భార్య, భర్త, ఇద్దరు పిల్లలు వాంతులు చేసుకుంటూ ఉండటాన్ని గమనించింది. ఏమైందని ప్రశ్నించగా, రామకృష్ణ అసలు విషయం వెల్లడించినట్లు సమాచారం. పిల్లలకు వెంటనే వైద్యం అందించాలని కోరినప్పటికీ, తాను ఆసుపత్రికి వెళ్లేందుకు ఆయన నిరాకరించారు. కుటుంబ సభ్యులు పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత రామకృష్ణ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
3
Beranda › Posts filed under The elder son died along with the father
Showing posts with label The elder son died along with the father. Show all posts
Showing posts with label The elder son died along with the father. Show all posts
Subscribe to:
Posts (Atom)
