ఎన్విడియా బోర్డు సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు సంబంధించి మరో ప్రేమాయణం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే చైనా గూఢచారితో సన్నిహిత సంబంధం ఉన్నట్లు జెన్సన్ హువాంగ్ అంగీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా కంపెనీలోని మరో ఉద్యోగితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ బాంబు పేల్చింది. హువాంగ్‌కు, తన కింద పనిచేసే ఎన్విడియా హెల్త్‌కేర్ వైస్ ప్రెసిడెంట్ కింబర్లీ పావెల్‌తో వివాహేతర సంబంధం ఉందని పేర్కొంది. ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం మార్చిలో జరిగిన ఒక ఎన్విడియా సమావేశం సందర్భంగా కాలిఫోర్నియాలోని శాన్ హోసేలో ఉన్న ఒక హోటల్లో హువాంగ్, 48 ఏళ్ల పావెల్ సన్నిహితంగా ఉన్న దృశ్యాలు వీడియోలో రికార్డ్ అయ్యాయి. రెండు వివాహేతర సంబంధాల ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో జెన్సన్ హువాంగ్ను తొలగించేందుకు ఎన్విడియా బోర్డు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కంపెనీలో హువాంగ్ భవిష్యత్తుపై చర్చించడానికి ఎన్విడియా బోర్డు గురువారం సమావేశానికి సిద్ధమవుతున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. కాగా, ఈ ఆరోపణల నేపథ్యంలో ఎన్విడియా కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో రూ.లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.
3
Beranda › Posts filed under Shares Plummet
Showing posts with label Shares Plummet. Show all posts
Showing posts with label Shares Plummet. Show all posts
Subscribe to:
Posts (Atom)
