తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టకుండా కొనసాగుతున్న నిర్మాణ ప్రాజెక్ట్‌లు, ఆర్ఎంసీ ప్లాంట్లపై కఠిన చర్యలకు సన్నద్ధమైంది. ఒక నిర్మాణ ప్రాజెక్టుకు అనుబంధంగా పనిచేస్తున్న ఆర్ఎంసీ ప్లాంట్‌కు మూసివేత ఉత్తర్వులు జారీ చేసిన పీసీబీ ఉన్నతాధికారులు, మరో నిర్మాణ ప్రాజెక్టుకు పనుల నిలిపివేత ఉత్తర్వులు జారీ చేయాలని బుధవారం జరిగిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.ప్రధానంగా గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్మాణ ప్రాజెక్టుల వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతున్నదని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో టీజీపీసీబీ రూలింగ్ టాస్క్‌ఫోర్స్ బృందాలు ఆయా నిర్మాణ ప్రాజెక్టులను తనిఖీ చేశాయి. నిర్మాణ ప్రాజెక్టుల చుట్టూ కనీసం 10 మీటర్ల ఎత్తులో విండ్ బ్రేకింగ్ వాల్స్ ఏర్పాటు చేయకపోవడం వల్ల దుమ్ము, ధూళి పరిసర ప్రాంతాలకు వ్యాపిస్తున్నదని గుర్తించాయి. ప్రాజెక్టుల అంతర్గత రహదారులు, పాదచారుల మార్గాలు, ప్రధాన రహదారులపై దుమ్ము పేరుకుపోవడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడటంతో పాటు పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణిస్తున్నదని నివేదికలో పేర్కొన్నారు. నిర్మాణ ప్రాజెక్టుల వద్ద నమోదైన శబ్ద స్థాయిలు వాణిజ్య ప్రాంతాలకు నిర్దేశించిన పరిమితి (పగటిపూట 65 డెసిబెల్స్) కంటే అధికంగా ఉన్నట్లు పీసీబీ అధికారులు గుర్తించారు. నిబంధనల ప్రకారం వ్యర్థాలను తొలగించకపోవడం, వాటి నిర్వహణకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు పీసీబీకి సమర్పించకపోవడం వంటి అంశాలను అధికారులు సీరియ్‌సగా తీసుకున్నారు. తనిఖీలు నిర్వహించిన మొత్తం 18 నిర్మాణ ప్రాజెక్టుల నిబంధనల అమలు తీరును సమీక్షించిన టాస్క్ ఫోర్స్ కమిటీ.. తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన ప్రాజెక్టులకు పర్యావరణ పరిహారం విధించాలని నిర్ణయించింది. స్వల్ప స్థాయి ఉల్లంఘనలకు పాల్పడిన నిర్మాణ ప్రాజెక్టుల బ్యాంకు గ్యారెంటీలను జప్తు చేయాలని సిఫారసు చేసింది. మరోవైపు, కొన్ని ప్రాజెక్టుల్లో బయటపడిన లోపాలను సరిదిద్దుకోవాలని ఆదేశాలు జారీ చేసిన అధికారులు, 10 రోజుల్లోగా వాటిని సరిచేసుకునేందుకు గడువు విధించారు. సభ్య కార్యదర్శి గుగులోతు రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చీప్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ బి.రఘు, జాయింట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ జవహర్లాల్, సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రసన్నరాణి, ఈఈ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
3
Beranda › Posts filed under Notices Issued to 18 Construction Firms for Non-Compliance
Showing posts with label Notices Issued to 18 Construction Firms for Non-Compliance. Show all posts
Showing posts with label Notices Issued to 18 Construction Firms for Non-Compliance. Show all posts
Subscribe to:
Posts (Atom)
