కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం నుంచి ఉచితంగా ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్లు, నోట్‌ప్యాడ్, అల్ట్రాబుక్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైస్‌లను పొందవచ్చు. రూ.1.8 లక్షల వరకు ధర ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను ఉచితంగా అందించనున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ఆర్ధికశాఖకు చెందిన వ్యయ విభాగం నవంబర్ 10వ తేదీన ఈ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ రూల్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా ల్యాప్‌టాప్, ట్యాబ్‌లు తీసుకోవచ్చు. సెక్షన్ ఆఫీసర్ లేదా అంతకంటే ఎక్కువ హోదా ఉన్న ఉద్యోగులకు వీటిని పొందవచ్చు. ప్రభుత్వ అధికారిక పనులు చేసేందుకు ఉద్యోగులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్, ట్యాబెట్లు లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉచితంగా అందించనుంది. గతంలో సాధారణ డివైజ్‌లకు రూ.లక్ష, మేక్ ఇన్ ఇండియా భాగాలు ఎక్కువ ఉన్న ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు ఈ పరిమితి రూ.1.30 లక్షల వరకు ఉండేది. కానీ ఇప్పుడు పరిమితిని కేంద్రం పెంచింది. సాధారణ డివైజ్‌లకు రూ.1.50 లక్షల వరకు పరిమితి పెంచగా.. మేక్ ఇన్ ఇండియా కింద తయారైన పరికరాలకు రూ.1.80 లక్షలుగా ఫిక్స్ చేశారు. అదనంగా వర్తించే ట్యాక్సులు, సాధారణ సాఫ్ట్వేర్ ఖర్చులు ఇందులో కలిసి ఉంటాయి. 7వ వేతన సంఘం ప్రకారం పే లెవల్ 12 లేదా అంతకంటే ఎక్కువ హోదా ఉన్న ఉద్యోగులు ఈ పరిమితి వరకు ఉచితంగా పొందవచ్చు. ఇక పే లెవల్ 8 నుంచి 11 మధ్య ఉన్న ఉద్యోగుల్లో 50 శాతం మంది పొందేందుకు అర్హులు. పే లెవల్స్‌ను బట్టి మంజూరైన మొత్తం పోస్టుల్లో 75 శాతం మంది అధికారులకు ఈ సదుపాయం ఉంటుంది. అయితే అధికారులకు ఇచ్చిన ల్యాప్‌టాప్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు నాలుగేళ్ల పాటు ప్రభుత్వ ఆస్తిగానే ఉంటాయి. ఆ తర్వాత వీటిని తమ వ్యక్తిగత అవసరాల కోసం కూడా ఉద్యోగులు ఉపయోగించుకోవచ్చు. నాలుగేళ్ల తర్వాత తమ దగ్గరే ఉంచుకోవచ్చు. అయితే డేటా, సమాచారం భద్రతకు సంబంధించి ఉద్యోగులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొత్త మార్గదర్శకాల్లో నాలుగేళ్ల తర్వాత ఉద్యోగులు వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడం. మేకిన్ ఇండియా పరికరాలకు పరిమితి పెంచడం వంటివి ఉన్నాయి. దీంతో ఉద్యోగులు ఈ మార్గదర్శకాల ప్రకారం ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్లు వంటివి పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది పెద్ద శుభవార్తగా చెప్పవచ్చు. అధికారిక పనుల కోసం పొందిన ల్యాప్‌టాప్ నాలుగేళ్ల తర్వాత తమ వద్దనే ఉంచుకోవచ్చు. దీని వల్ల ఉచితంగా ల్యాప్‌టాప్ పొందే అవకాశం లభిస్తోందని చెప్పవచ్చు.
3
Beranda › Posts filed under Free laptops
Showing posts with label Free laptops. Show all posts
Showing posts with label Free laptops. Show all posts
Subscribe to:
Posts (Atom)
