కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ స్వయంగా రాసిన ఆత్మకథ 'బిలాంగింగ్ : ఏ జర్నీ ఆఫ్ లవ్' ఆధారంగా తెలుగులో ఫీచర్ ఫిల్మ్ నిర్మించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ప్రకటించారు. ఈ సినిమా నిర్మాణానికి సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే నిర్మాతలుగా ముందుకు రావాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ జూలకంటి ఆంజనేయులు సినిమా నిర్మాణం కోసం రూ.2 కోట్లు అందజేస్తానని ప్రకటించారు. సినిమా నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 50 మందితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని జగ్గారెడ్డి ప్రతిపాదించారు. సినిమా బడ్జెట్‌ను సమకూర్చుకుని మంచి దర్శకుడిని ఎంపిక చేయాలని పార్టీ నేతలకు సూచించారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. ఇందిరాగాంధీ కోడలిగా, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్యగా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల తల్లిగా సోనియా గాంధీ సాగించిన జీవిత ప్రయాణాన్ని సినిమాలో చూపించనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హత్యల తర్వాత కుటుంబం ఎదుర్కొన్న విషాదాలు, పిల్లలను పెంచడంలో ఎదురైన సవాళ్లు, అనంతరం రాజకీయాల్లోకి వచ్చి ఆమె సాగించిన ప్రస్థానాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తామని చెప్పారు.
3
Beranda › Posts filed under Belonging: A Journey of Love
Showing posts with label Belonging: A Journey of Love. Show all posts
Showing posts with label Belonging: A Journey of Love. Show all posts
Subscribe to:
Posts (Atom)
