రాత్రి పడుకోవడానికి ముందు కాకుండా కనీసం 1 నుండి 2 గంటల ముందే కొద్దిగా పెరుగు తినడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తినడం వల్ల మనం నిద్రపోయే సరికి జీర్ణక్రియ సగం పూర్తవుతుంది. దీనివల్ల కడుపులో ఉబ్బరం అజీర్తి లేదా అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా ఉంటుంది. పెరుగులో ‘ట్రిప్టోఫాన్’ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది నిద్రను పుట్టించే హార్మోన్లను ప్రేరేపించి రాత్రివేళ హాయిగా, ప్రశాంతమైన నిద్ర పట్టేలా తోడ్పడుతుంది.ఇక అలాగే రాత్రిపూట పెరుగు తినేటప్పుడు అందులో ఒక చిటికెడు జీలకర్ర పొడి లేదా నల్ల ఉప్పు కలుపుకుని తింటే జీర్ణక్రియ మరింత వేగంగా సులభంగా జరుగుతుంది. రాత్రివేళ పెరుగు తినడం తప్పు కాదు, కానీ తినే సమయం విషయంలో సరైన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. పడుకోవడానికి గంటన్నర ముందే మితంగా పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బాగుండటమే కాకుండా రాత్రివేళ ప్రశాంతమైన నిద్ర మీ సొంతమవుతుంది.
ホーム
/
Health Tips
/
రాత్రి పడుకునే ముందు పెరుగు తినొచ్చా?
Thursday, August 6, 2026
arogyam Can you eat curd before going to bed at night? Curd contains an amino acid called tryptophan health Health Tips
No comments:
Post a Comment