వివో ఎస్ 2 స్మార్ట్‌ఫోన్ విడుదల

Thursday, August 6, 2026

a powerful Dimensity chipset AI-driven software capabilities AMOLED display business national technology Vivo S2 Smartphone Launched

t f B! P L

దేశీయ మార్కెట్ లో వివో కొత్త S-సిరీస్ స్మార్ట్‌ఫోన్ వివో ఎస్ 2ను లాంచ్ చేసింది . X-సిరీస్ కంటే కాస్త తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ వినియోగదారులకు ప్రీమియం అనుభూతిని అందిస్తూ సరైన ఎంపికగా నిలుస్తుంది. కొత్త మోడల్‌లో AMOLED డిస్‌ప్లే, శక్తివంతమైన Dimensity చిప్‌సెట్, AI ఆధారిత సాఫ్ట్‌వేర్ ఫీచర్లు వినియోగదారుల రోజువారీ ఉపయోగానికి బెస్ట్ గా నిలుస్తాయి .కెమెరా తో ఫోటోలు, వీడియోలు క్వాలిటీ , బ్యాటరీ ఆప్టిమైజేషన్ , లాంగ్ టైం వారంటీ వంటివి వినియోగదారులకు నమ్మకాన్ని కలిగిస్తాయి.Vivo S2 డిజైన్, పెర్ఫార్మన్స్ , సాఫ్ట్‌వేర్ అనుభవంతో మిడ్ రేంజ్ ప్రీమియం సెగ్మెంట్‌లో పోటీని ఇస్తుంది. 6.83 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు వినియోగదారులకు స్మూత్ విజువల్ అనుభవాన్ని అందిస్తాయి. MediaTek Dimensity 7360-Turbo ప్రాసెసర్ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ రోజువారీ పనులు, గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి వాటిని వేగంగా నిర్వహిస్తుంది . 50MP మెయిన్ కెమెరా , 2MP సపోర్ట్ కెమెరా , 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇవి ఫోటోలు, వీడియోలు నాణ్యతతో అందిస్తాయి .7,050mAh బ్యాటరీ లాంగ్ టైం ఉపయోగాన్నిఅందిస్తూ 44W FlashCharge తో వేగంగా ఛార్జ్ అవుతుంది. స్టోరేజ్ పరంగా 8GB RAM (ఎక్స్‌టెండెడ్ RAM సపోర్ట్) , 128GB/256GB ROM అందుబాటులో ఉన్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ Android 16 ఆధారంగా OriginOS 6 తో పనిచేస్తుంది.సేఫ్టీ పరంగా IP68/IP69 రేటింగ్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. కనెక్టివిటీ లో 5G డ్యూయల్ సిమ్, Wi-Fi 6, Bluetooth 5.4, GPS, USB Type-C వంటి ఆప్షన్లు ఉన్నాయి. రంగులలో Sapphire Blue, Regal Bronze, Silk White వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త మోడల్‌ను Vivo అధికారిక వెబ్‌సైట్, Flipkart, Amazon, దేశవ్యాప్తంగా ఉన్న అధికారిక రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఎక్స్చేంజ్ బోనస్, డిస్కౌంట్ ధరలో V-Shield ప్రొటెక్షన్, ఒక సంవత్సరం అదనపు వారంటీ, Jio ప్రత్యేక బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి. ఈ Jio బెనిఫిట్స్‌లో 18 నెలల పాటు 5TB క్లౌడ్ స్టోరేజ్ , Google Gemini Pro యాక్సెస్ కూడా ఉంటాయి .

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ