దుబాయ్ లో 20 నిమిషాల్లో 7 పేలుళ్లు

Wednesday, August 5, 2026

7 Explosions in 20 Minutes in Dubai Following the blasts international Jebel Ali Industrial Area thick smoke billowed into the sky

t f B! P L

దుబాయ్ లోని జెబెల్ అలీ ఇండస్ట్రీయల్ ప్రాంతంలో జరిగిన ఈ పేలుళ్లు జరిగాయి. దీని వెనక ఇరాన్ దాడి చేసిందా లేక మరో కారణం ఏమైనా ఉందా అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు దుబాయ్. పేలుళ్ల తర్వాత జెబెల్ అలీ ఇండస్ట్రీయల్ ఏరియాలోని ఆకాశంలో దట్టమైన పొగలు కమ్మేశాయి. మంటలు ఎగసిపడ్డాయి. ఈ పేలుళ్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. దుబాయ్‌లోని జెబెల్ అలీ ఇండస్ట్రియల్ ఏరియాలో కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే కనీసం 7 సార్లు పేలుళ్లు వినిపించాయని ఇరాన్‌కు చెందిన 'మెహర్' వార్తా సంస్థ తెలిపింది. దీనికి సంబంధించి ఆకాశంలో దట్టమైన పొగ అలుముకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పేలుళ్లు ఎందుకు జరిగాయి అనేదానిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇది పారిశ్రామిక ప్రమాదమా లేక శత్రువుల దాడా అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. ఈ పేలుళ్లకు సంబంధించిన వీడియోలు తీశారనే ఆరోపణలతో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నడుస్తున్న తరుణంలో... యెమెన్ నుంచి యూఏఈపై మిస్సైల్ దాడి జరిగి ఉండవచ్చని కొన్ని ఇరాకీ వార్తా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. అయితే, అధికారికంగా యూఏఈ మీడియా దీనిని ధృవీకరించలేదు. ఈ పేలుళ్లకు, క్షిపణి దాడికి సంబంధం ఉందా లేదా అనే దానిపై స్పష్టత లేదు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ