సెనెగల్ లో జరగనున్న సమ్మర్ యూత్ ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే భారత అథ్లెట్ల బృందాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తాజాగా ప్రకటించింది. 11 క్రీడలకు చెందిన మొత్తం 17 మంది అథ్లెట్లను ఎంపిక చేసినట్టు తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 31 నుంచి నవంబర్ 13 మధ్య డకార్‌లో ఈ క్రీడా సంరంభం జరగనుంది. ఆఫ్రికా ఖండంలో జరుగుతున్న తొలి ఒలింపిక్ కార్యక్రమం కావడంతో ఈ ఈవెంట్ ప్రత్యేకతను సంతరించుకుంది. 17 ఏళ్ల లోపు యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు యూత్ ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు. 25 క్రీడలకు చెందిన 2700 యువత క్రీడాకారులతో కూడిన 207 బృందాలు యూత్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నాయి. అంతర్జాతీయ ఈవెంట్స్‌లో ఉండే పోటీని యువతకు పరిచయడం చేయడంతో పాటు ఒకరినొకరు చూసి నేర్చుకునేందుకు, విభిన్న సంస్కృతులపై అవగాహన పెంచుకునేందుకు యూత్ ఒలింపిక్స్ ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు. యూత్ ఒలింపిక్స్ సందర్భంగా ఆఫ్రికా దేశాల జాతీయ ఒలింపిక్ కమిటీలతో సహకారం కోసం భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష సంతకాలు చేసే అవకాశం ఉంది. ఈ సమ్మర్ యూత్ ఒలింపిక్స్ యువత క్రీడాప్రయాణంలో ఓ కీలకమైలురాయిగా నిలిచిపోనుందని పీటీ ఉష వ్యాఖ్యానించారు. యువ క్రీడాకారులు భారత క్రీడారంగ భవిష్యత్తు అని అన్నారు. వీరిలో కొందరు 2032 బ్రిస్బేన్‌లో జరిగే ఒలింపిక్స్‌లో భారత్‌ను ప్రతానిథ్యం వహించవచ్చని కూడా చెప్పారు. వారు దేశానికి గర్వకారణంగా నిలుస్తారన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. ఈ సందర్భంగా అథ్లెట్లు, కోచ్‌లు, ఇతర సహాయక సిబ్బందికి ఐఓఏ అభినందనలు తెలియజేసింది.
3
Beranda
› 17 athletes
› Indian Olympic Association Announces Indian Athlete Contingent
› national
› representing 11 different sports
› sports
› Summer Youth Olympics in Senegal
› సెనెగల్ లో సమ్మర్ యూత్ ఒలింపిక్స్ : భారత అథ్లెట్ల బృందాన్ని ప్రకటించిన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్
Subscribe to:
Post Comments (Atom)
