3

వర్జీనియా వర్సిటీలో కాల్పులు : ఐదుగురికి గాయాలు : ఒకరి పరిస్థితి విషమం

అమెరికాలోని వర్జీనియా స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం జరిగిన కాల్పుల్లో ఒక విద్యార్థితో పాటు మరో నలుగురు గాయపడ్డారు. బాధితుల్లో ఒకరి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త అకడమిక్ ఇయర్ ప్రారంభం కావాల్సిన సమయంలో హింసాత్మక ఘటన జరగడం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను షాకయ్యేలా చేసింది. కాగా, యూనివర్శిటీ డార్మిటరీలో తలదాచుకున్న అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేసారు. అతడి వయసు 19 ఏళ్లు పేరు కామ్రన్‌ హారిస్‌గా గుర్తించారు. గాయపడిన విద్యార్థితో అతనికి సంబంధం ఏంటి? వీరి మధ్య గొడవ జరిగిందా? కాల్పులు జరపడానికి కారణం ఏమై ఉంటుందని ఆరా తీస్తున్నారు. కాల్పుల ఘటన విశ్వవిద్యాలయం హాస్టల్‌ సమీపంలో తెల్లవారుజామున 1.30 గంటలకు జరిగింది. చెస్టర్‌ఫీల్డ్ కౌంటీ పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన క్యాంపస్‌కు చేరుకుని, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వర్జీనియా వర్సిటీ అధికారులు కన్ఫామ్‌ చేసారు. సోమవారం నుంచి కొత్త సెమిస్టర్ క్లాసులు మొదలుకానుండటంతో, వారం రోజుల ముందే హాస్టళ్లను తెరిచారు. ఈ కీలక సమయంలో కాల్పులు జరగడంతో క్యాంపస్‌లోని విద్యార్థులు, సిబ్బంది తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం, గాయపడిన వారిలో ఒకరు వర్జీనియా స్టేట్ యూనివర్సిటీ విద్యార్థి అయితే మిగిలిన నలుగురు వర్సిటీ పరిసర ప్రాంతాలకు చెందిన స్థానికులు. ప్రాథమిక విచారణలో 'డ్రైవ్-బై షూటింగ్' కాదని కావాలనే కొందరు కాల్పులకు తెగబడ్డారని పోలీసులు అనుమానం వ్యక్తం చేసారు. యూనివర్సిటీ ఆవరణలో పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. కాల్పుల వెనక అసలు కారణం ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసారు.

Related Post

Previous
Next Post »