Posts

Showing posts with the label Russian Deputy Prime Minister Alexander Novak has issued

ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు రష్యా పెట్రో ఎగుమతులు నిలిపివేత !

Image
ఏ ప్రిల్ 1వ తేదీ నుంచి గ్యాసోలిన్ (పెట్రోల్) ఎగుమతులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు రష్యా తెలిపింది. ఈ మేరకు రష్యా ఉప ప్రధాన మంత్రి అలెగ్జాండర్ నోవాక్ ఇంధన మంత్రిత్వ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పలు నివేదిక ప్రకారం ఈ నిషేధం ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు, అంటే దాదాపు నాలుగు నెలల పాటు అమల్లో ఉండనుంది. రష్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు పెరగడానికి కారణం కావచ్చని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యా ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం కారణంగా ప్రపంచ చమురు మార్కెట్‌లో నెలకొన్న అస్థిరతను అదుపు చేయడమే రష్యా ప్రాథమిక లక్ష్యంగా కనిపిస్తుంది. గత ఏడాది రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరత ఏర్పడింది. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా, దేశీయ మార్కెట్‌లో సరఫరాను స్థిరీకరించాలని పుతిన్ సర్కార్ భావిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ దాడులు పెరిగాయి. ఈ ముప్పు దృష్ట్యా ఇంధన నిల్వలను దేశం దాటకుండా జాగ్రత్తపడుతోందని అం...