Posts

Showing posts with the label Octane-95 Petrol Price in Iran: ₹2.50 Per Liter

ఇరాన్‌లో ఆక్టేన్-95 పెట్రోల్ ధర లీటరు రూ. 2.50 !

Image
ఇ రాన్‌లో ఆక్టేన్-95 పెట్రోల్ ధర లీటరుకు 15,000 ఇరానియన్ రియాల్స్. మన భారత కరెన్సీలో ఇది సుమారు రెండున్నర రూపాయలు. ఇరాన్ ముడిచమురు నిల్వల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. తన దేశ ప్రజలపై భారం పడకూడదని ప్రభుత్వం ఏటా వందల బిలియన్ డాలర్ల నష్టాన్ని భరిస్తూ భారీగా రాయితీలు ఇస్తోంది. ఇరాన్ ప్రభుత్వం ఒక స్మార్ట్ ప్లాన్ అమలు చేస్తోంది. ప్రతి నెలా మొదటి 60 లీటర్ల వరకు అత్యంత తక్కువ ధరకే ఇంధనాన్ని అందిస్తుంది. వినియోగం పెరిగే కొద్దీ ధరలో స్వల్ప మార్పులు ఉండేలా రేషన్ కార్డుల వంటి విధానాన్ని అమలు చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, హోర్ముజ్ జలసంధి గుండా రవాణా కష్టమైనా.. దేశీయంగా ధరలు పెరగకుండా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ధరలు ఇంత తక్కువగా ఉండటం వల్ల పొరుగు దేశాలకు పెట్రోల్ భారీగా స్మగ్లింగ్ అయ్యే ప్రమాదం ఉంది. దీన్ని అరికట్టడానికి ఇరాన్ ప్రభుత్వం రేషన్ కార్డులను తప్పనిసరి చేస్తూ నిఘాను కఠినతరం చేస్తోంది. అయితే, ఈ స్థాయి సబ్సిడీలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై పెను భారంగా మారుతున్నాయి.