నేపాల్‌లో మావోయిస్టు గణపతి ?
నే పాల్‌లో మావోయిస్టు గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. అయితే గణపతిని భారత్‌కు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వృద్దాప్యం కారణంగా మావోయిస్టు పార్టీ కార్యదర్శి పదవిని గణపతి వదిలిపెట్టిన సంగతి తెలిసిందే. మరో వైపు హైదరాబాద్‌లో పోలీస్ ఉన్నతాధికారుల ఎదుట నలుగురు కీలక మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సెక్రటరీ దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు, కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డితోపాటు నున్నె నరసింహారెడ్డిలు లొంగిపోయారు. ఇటీవల ఆసీఫాబాద్ అడవుల్లో ఎసఐబీ ఎదుట దేవ్‌జీతోపాటు మల్లా రాజిరెడ్డి లొంగిపోయిన సంగతి తెలిసిందే. అదీకాక దేవ్‌జీతోపాటు పలువురు అగ్రనేతలు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలకు చేరుకున్నారంటూ నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కర్రెగుట్టల ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు మరణించిన విషయం విదితమే.2026, మార్చి 31...