ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.169 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మించిన సరికొత్త డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఈ నూతన కేంద్రం ఒడిశా రాష్ట్ర ప్రగతితో పాటు యావత్ దేశ ఆర్థిక రంగానికి సరికొత్త దిశానిర్దేశం చేస్తుందని కొనియాడారు. భువనేశ్వర్ నగరం నవ భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోందని, ఈ ప్రాజెక్టుతో అనుసంధానమైన అధికారులను ఆయన అభినందించారు. దేశంలో ఆర్థిక సమ్మిళితత్వాన్ని విస్తరించడంలో డిజిటల్ బ్యాంకింగ్ పోషిస్తున్న పాత్రను గుర్తుచేశారు. ఇదే సమయంలో గత కాంగ్రెస్ పాలనలోని బ్యాంకింగ్ విధానాలను మోదీడీ తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. గత విధానాలు కొద్దిమంది ప్రభావవంతమైన పెద్దలకు మాత్రమే మేలు చేశాయని దుయ్యబట్టారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాధారణ పేద, మధ్యతరగతి ప్రజలు ఒక చిన్న బ్యాంక్ ఖాతా తెరవాలన్నా గ్యారంటర్లను వెతుక్కోవాల్సి వచ్చేదని ప్రధాని గుర్తుచేశారు. అదే సమయంలో రాజకీయ పలుకుబడి ఉన్న కుబేరులకు మాత్రం కేవలం ఫోన్ కాల్స్ ద్వారా ఢిల్లీ పెద్దల సిఫార్సులతో వేల కోట్ల రూపాయల రుణాలు దక్కేవని ఆరోపించారు. ఈ అడ్డగోలు 'ఫోన్ బ్యాంకింగ్' వల్లే దేశంలో బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) భారీగా పేరుకుపోయాయని మండిపడ్డారు.
3
Beranda
› Bhubaneswar is playing a pivotal role in the building of a 'New India'
› national
› Odisha
› Prime Minister Narendra Modi Inaugurates RBI Data Center in Bhubaneswar
› భువనేశ్వర్‌లో ఆర్‌బీఐ డేటా సెంటర్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
Subscribe to:
Post Comments (Atom)
