About LATEST NEWS AP TO TG

Telugu computer tutorials Unicode to Anu conversion smartphone tips Telugu Use smartwatch tips Telugu EV news Telugu tech upd

Manual Description Here: Ea eam labores imperdiet, apeirian democritum ei nam, doming neglegentur ad vis.

3
Showing posts with label gold ornaments worth Rs. 3 lakh and a mobile phone recovered. Show all posts
Showing posts with label gold ornaments worth Rs. 3 lakh and a mobile phone recovered. Show all posts

తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్ : రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌ స్వాధీనం

హైదరాబాద్ లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అలవాటు నేరస్థుడిని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలానికి చెందిన యర్రం శెట్టి చరణ్ విఘ్నేశ్ అలియాస్ చరణ్ (25) హైదరాబాద్‌లోని కొత్తపేటలో ఉంటున్నాడు. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 17న వనస్థలిపురం విజయపురి కాలనీ ఫేజ్‌-1కు చెందిన జనార్దన్‌రావు ఇంటికి తాళం వేసి స్వగ్రామానికి వెళ్లారు. ఈ నెల 22న తిరిగి వచ్చేసరికి ఇంటి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉండటంతో పాటు బీరువాలు చిందరవందరగా కనిపించాయి. సుమారు 30 గ్రాముల బంగారు ఆభరణాలు, ఏటీఎం కార్డులు, నగదు అపహరణకు గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు రాత్రివేళ ద్విచక్రవాహనంపై కాలనీల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించేవాడు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత చిన్న ఇనుపరాడ్డుతో తలుపుల తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించేవాడు. బీరువాలను ధ్వంసం చేసి బంగారం, వెండి ఆభరణాలు, నగదు దొంగిలించేవాడు. అనంతరం వాటిని విక్రయించి విలాసవంతమైన జీవితానికి ఖర్చు చేసేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. నవంబర్‌ 5న సాయంత్రం 4 గంటల సమయంలో ఎన్జీవోస్‌ కాలనీలోని ఓ నగల దుకాణం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని క్రైమ్‌ టీమ్‌ అదుపులోకి తీసుకుంది. విచారణలో కీసర పోలీస్‌స్టేషన్‌లో మూడు, సరూర్‌నగర్‌లో ఒకటి, వనస్థలిపురంలో మూడు.. మొత్తం ఏడు ఇళ్ల దొంగతనం కేసుల్లో తన పాత్రను వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 26 గ్రాముల బంగారు ఆభరణాలు, వన్‌ప్లస్‌ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Read More...