108MP కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లే

Thursday, April 7, 2022

108MP కెమెరా realme science smart phone technologe సూపర్ AMOLED డిస్ప్లే

t f B! P L


రియల్ మీ ఈరోజు ఇండియాలో Realme 9 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 108ఎంపి భారీ కెమెరా మరియు 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన సూపర్ AMOLED డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్లతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ Realme 5G యొక్క 4G వెర్షన్ అయినా కూడా ఫీచర్లను మాత్రం ఏమాత్రం తగ్గకుండా అందించింది. రియల్ మీ 9 రెండు వేరియంట్లలో లభిస్తుంది మరియు HDFC బ్యాంక్ అఫర్ తో వచ్చింది. Realme 9 (6GB + 128GB) : ధర రూ.17,999/-, Realme 9 (6GB + 128GB) : ధర రూ.18,999/- ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు realme.com నుండి భారీ అఫర్ తో ఏప్రిల్ 12 న మొదటిసారి సేల్ కి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 2000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, డిస్కౌంట్ తో కేవలం రూ.15,999 రూపాయల ప్రారంభ ధరలో ఈ స్మార్ట్ ఫోన్ ను పొందవచ్చు. రియల్ మీ 9 స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ FHD+ (1080x2400) రిజల్యూషన్ కలిగిన సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 360 Hz టచ్ శాంప్లింగ్ కలిగి వుంటుంది. ఈ ఫోన్ కేవలం 7.99mm మందంతో సన్నని డిజైన్ తో కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 8GB ర్యామ్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ సన్ బరస్ట్ బస్ట్ గోల్డ్, స్టార్ గేజ్ వైట్ మరియు మేటోర్ బ్లాక్ అనే మూడు కలర్ లలో లభిస్తుంది. కెమెరాల విషయానికి వస్తే, Realme 9 స్మార్ట్ ఫోన్ వెనుక ఆకర్షణీయమైన డిజైన్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 108MP Samsung HM6 సెన్సార్ కలిగిన మైన్ కెమెరాకి జతగా 8MP సూపర్ వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ వున్నాయి. అలాగే, సెల్ఫీల కోసం 16MP AI సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 33W సూపర్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన పెద్ద 5000 mAh బ్యాటరీతో వస్తుంది. సెక్యూరిటీ పరంగా, ఈ ఫోన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వుంది మరియు ఇది హార్ట్ రేట్ మోనిటర్ ఫీచర్ తో వస్తుంది. 

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ