ఐక్యూ నియో 6 స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ !
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ మన దేశంలో ఇప్పటికే ఎన్నో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. బడ్జెట్, ప్రీమియం ఫోన్ల మార్కెట్‌లో మంచి వాటా సాధించాలని చూస్తున్న ఈ సంస్థ మరో కొత్త ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్‌కు పరిచయం చేయనుంది. ఐక్యూ నియో 6 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఏప్రిల్ 13న చైనాలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Weibo పోస్ట్ ద్వారా ఐక్యూ కంపెనీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. 2021లో విడుదలైన iQOO Neo 5 వేరియంట్‌కు సక్సెసర్‌గా Neo 6ను రూపొందించినట్టు ఈ పోస్ట్‌లో పేర్కొంది. ఈ కొత్త ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉండే 4,700mAh బ్యాటరీతో కంపెనీ దీన్ని తయారు చేసింది. ఐక్యూ నియో 6 స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో ప్రైమరీ కెమెరా సెన్సార్ కెపాసిటీ 64-మెగాపిక్సెల్. ఈ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఈ డివైజ్ 5G కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో 12GB RAM ఉంటుంది. ఈ ఫోన్‌ను 6.62 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేతో రూపొందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో మంచి యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. దీని ధర మన కరెన్సీలో రూ.30 వేల వరకు ఉండవచ్చు. ఈ ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేయడంపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటివరకు ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్లకు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్ కర్వ్ ఎడ్జ్ డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. వేగన్ లెదర్ ఫినిషింగ్ బ్యాక్ కవర్‌తో ఫోన్‌ను డెలివరీ చేయనుంది. ఐక్యూ నియో 6 మొత్తం మూడు కలర్ ఆప్షన్లలో.. బ్లాక్, బ్లూ, ఆరెంజ్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.