భారత మార్కెట్లోకి మోటరోలా Moto G22 స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ భారత మొట్టమొదటి MediaTek Helio G37 ప్రాసెసర్‌తో వచ్చింది. ఈ ఫోన్ బడ్జెట్ కొనుగోలుదారులే లక్ష్యంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. 6.5-అంగుళాల 90 Hz మాక్స్ విజన్ డిస్‌ప్లే, 20W TurboPower ఛార్జర్‌తో సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీ లైఫ్ అందిస్తోంది. మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. బడ్జెట్ ఫోన్ అయినా ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ బాక్స్‌తో వస్తోంది. Moto G22 స్మార్ట్ ఫోన్.. Redmi 10, Realme C35 స్మార్ట్ ఫోన్లకు పోటీగా మార్కెట్లోకి వచ్చింది. బడ్జెట్ ఫోన్లలో Motorola అందించే ఈ కొత్త స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆకర్షించేలా ఉంది. మోటరోలా ఐఫోన్ లాంటి ఫ్లాట్‌బెడ్ డిజైన్ మాదిరిగా తీసుకొస్తోంది. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో మోటరోలా బ్రాండింగ్ మధ్యలో ప్యానెల్‌లు ఉన్నాయి. వెనుక ప్యానెల్‌లో దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్ స్పెషల్ అట్రాక్షన్.. ఇందులో నాలుగు కెమెరా సెన్సార్లు కూడా ఉన్నాయి. Moto G22 సింగిల్ 4GB+64GB వేరియంట్ ధర రూ. 10,999లకు అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 1000 తగ్గింపుతో ఈ డివైజ్ పొందవచ్చు. దీని ధర డిస్కౌంట్ ధరతో రూ. 9999కి తగ్గుతుంది. స్టాక్ ముగిసే వరకు లిమిటెడ్ పిరియడ్ మాత్రమే ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 14 మధ్య అందుబాటులో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ ఏప్రిల్ 13న ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. స్మార్ట్‌ఫోన్ ఐస్‌బర్గ్ బ్లూ, కాస్మిక్ బ్లాక్‌తో సహా రెండు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. Motorola త్వరలో మూడవ కలర్ వేరియంట్ కూడా తీసుకురానుంది. చూడటానికి కలర్ ఫుల్‌గా పుదీనా ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా ఉంటుంది.
0 Comments