Ad Code

సేఫ్టీ విషయంలో బాగా వెనకబడిన హ్యుందాయ్ క్రెటా ?


భారత మిడ్-సైజ్ ఎస్‌యూవీ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న వాహనాలలో ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉండే హ్యుందాయ్ క్రెటా , సేఫ్టీ విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉందనే చెప్పాలి. గ్లోబల్ ఎన్‌క్యాప్  ఏజెన్సీ ఈ ఎస్‌యూవీ కోసం నిర్వహించిన క్రాష్ టెస్టులో ఇది 3-స్టార్ సేఫ్టీ రేటింగ్ ని మాత్రమే పొందినట్లు సదరు ఏజెన్సీ తెలిపింది. హ్యుందాయ్ అమ్ముతున్న పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20.  కార్ కూడా ఈ క్రాష్ టెస్టులో 3-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.ఇక ఈ క్రాష్ టెస్ట్ కోసం గ్లోబల్ ఎన్‌క్యాప్ ఎంట్రీ లెవల్ క్రెటా ఇంకా ఎంట్రీ లెవల్ ఐ20 వేరియంట్‌లను ఉపయోగించింది. ఈ రెండు మోడళ్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు ఇంకా అలాగే ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఫ్రంట్ సీట్‌బెల్ట్ రిమైండర్ ఇంకా రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్లను మాత్రమే స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. అయినప్పటికీ, ఈ రెండు కార్లు కూడా గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 3-స్టార్ రేటింగ్‌ను మాత్రమే పొందడం జరిగింది. హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ కార్ ని గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఫ్రంటల్ ఆఫ్‌సెట్ క్రాష్ టెస్ట్‌కు గురిచేసినప్పుడు, హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ పెద్దల రక్షణ కోసం 3 స్టార్ రేటింగ్‌ను స్కోర్ చేసింది. ఇక ఈ పరీక్షలో ఎస్‌యూవీ బాడీ షెల్ అస్థిరంగా ఉన్నట్లు కనుగొనబడింది. ఇంకా అది ప్రమాద తీవ్రతను తట్టుకోలేకపోయింది. అంతేకాకుండా, ఈ కారు ఫుట్‌రెస్ట్ కూడా చాలా అస్థిరంగా ఉన్నట్లు తెలిసింది.ఈ ఎస్‌యూవీ మొత్తం 17 పాయింట్లకు గానూ 8 పాయింట్లని స్కోర్ చేసింది. అయితే, డ్రైవర్ ఇంకా అలాగే కో-ప్యాసింజర్ హెడ్ ప్రొటెక్షన్ విషయంలో మంచిగా రేట్ చేయబడింది. ఇక గ్లోబల్ ఎన్‌క్యాప్ నివేదిక ప్రకారం, ఈ ఎస్‌యూవీలో డ్రైవర్ ఇంకా అలాగే కో-డ్రైవర్ మెడకు మంచి రక్షణ అనేది లభించింది

Post a Comment

0 Comments

Close Menu