టాటా మోటార్స్ మరో అద్భుతమైన ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. టాటా అవిన్య కాన్సెప్ట్‌ను విడుదల చేసింది. అవిన్య సంస్కృత భాషలోని పదం. అవిన్య అంటే ఆవిష్కరణ అని అర్థం. అదే పేరుతో సూపర్ కారును ఆవిష్కరించింది టాటా మోటార్స్. అవిన్య కాన్సెప్ట్ సరికొత్త సదుపాయాలతో ఉండటం విశేషం. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీలో భాగంగా టాటా మోటార్స్ నెక్స్ట్ జెనరేషన్ ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందిస్తోంది. ఆటోమొబైల్ రంగంలో సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించేందుకు కృషి చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వైపు తాము సాధించిన అతిపెద్ద పురోగతిగా టాటామోటార్స్ ప్రకటించింది. అవిన్య కార్ జెన్ 3 ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించినది. ఈ కారులోని బ్యాటరీ, ఛార్జింగ్ సిస్టమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కారులో అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సామర్థ్యం ఉంది. కేవలం 30 నిమిషాలు ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అంటే అరగంట ఛార్జింగ్‌తో హైదరాబాద్ నుంచి తిరుపతికి ఈజీగా వెళ్లిపోవచ్చు. ఇది కొత్త తరం టెక్నాలజీ, సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిపి రూపొందించిన ఎలక్ట్రిక్ కార్. కస్టమర్లకు అత్యంత ప్రీమియం ఫీచర్స్‌తో, సరళమైన, ప్రశాంతమైన కస్టమర్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ అద్భుతమైన కార్ 2025 లోగా మార్కెట్లోకి అందుబాటులోకి రానుందని టాటా మోటార్స్ ప్రకటించింది. అవిన్య కాన్సెప్ట్‌ను రూపొందిస్తున్నప్పుడు, ఎందులో లేని విధంగా మొబిలిటీ సొల్యూషన్‌ను అందించాలన్నది ప్రధాన ఆలోచన అని, అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌తో చక్కగా రూపొందించబడిన ఈ కారు కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గిస్తుందని, ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరణను వేగవంతం చేయడమే కాకుండా, ఈ ఉద్యమానికి తాము నాయకత్వం వహించేలా సృష్టించామని టాటా మోటార్స్, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. అవిన్య కారులో బటర్‌ఫ్లై డోర్స్ ఆకట్టుకుంటాయి. ఈ కారు తయారీకి లైట్‌వెయిట్ మెటీరియల్స్ ఉపయోగిస్తారు. దీని వల్ల కారు బరువు తక్కువగా ఉంటుంది. కారు ఇంటీరియర్స్ అద్భుతంగా ఉన్నాయి. కారు స్టీరింగ్ నుంచి సీటింగ్ వరకు అంతా సరికొత్తగా కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం టాటా మోటార్స్ Curvv పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ట్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
అర గంట ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల ప్రయాణం
by Telugu Lo Computer at April 29, 2022
Labels:
2025 లోగా మార్కెట్లోకి అందుబాటులోకి
,
electric car
,
science
,
technologe
,
అర గంట ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల ప్రయాణం
,
అరగంట ఛార్జింగ్‌తో హైదరాబాద్ నుంచి తిరుపతి
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment