ఇండియాలో వన్ ప్లస్ తన లేటెస్ట్ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ Oneplus Y1S Pro ని విడుదల చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీని చాలా తక్కువ ధరకి లాంచ్ చేయడం ఆశ్చర్యకరమైన విషయం. వన్ ప్లస్ 4కే అల్ట్రా హైడెఫినేషన్ స్మార్ట్ టీవీ వన్ ప్లస్ వై 1ఎస్ ప్రో స్మార్ట్ టీవీ కొత్త బోర్డెర్ లెస్ డిజైన్, Dolby Audio మరియు HDR 10+ వంటి భారీ ఫీచర్లను కలిగివుంటుంది. ఈ స్మార్ట్ టీవీని కేవలం 30 వేల రూపాయల కంటే తక్కువ ధరతో ఇండియన్ మార్కెట్లో వున్న చాలా స్మార్ట్ టీవీ లకు గట్టిగా తీసుకు వచ్చింది. Oneplus Y1S Pro 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ రూ.29,999 ధరలతో వచ్చింది. ఈ స్మార్ట్ టీవీ పైన గొప్ప బ్యాంక్ ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీని SBI క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 2,500 రూపాయల తక్షణ డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది. ఏప్రిల్ 11 నుండి ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అమెజాన్ తో పాటుగా OnePlus.in, Croma, Jio Digital, Reliance Digital మరియు అన్ని ప్రధాన ఆఫ్ లైన్ స్టోర్ లలో కూడా లభిస్తుంది. ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ TV Y1S Pro ఫీచర్ల విషయానికి వస్తే, ఈ 43 ఇంచ్ సైజులో 4K (3840x2160) రిజల్యూషన్ కలిగివుంటుంది. ఈ స్మార్ట్ టీవీ గామా ఇంజిన్ తో HDR 10, HDR 10+ మరియు HLG సపోర్ట్ ను కలిగివుంది. TV Y1S Pro స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీతో 24W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీల ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఇతర ఫీచర్ల గురించి చూస్తే, ఈ వన్ ప్లస్ 4K స్మార్ట్ టీవీ Android 10 OS తో పనిచేస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ మరియు అలెక్సాతో వంటి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా వుంది. ఈ టీవీలు 3HMDI మరియు 2 USB మరియు 1 ఆప్టికల్ పోర్టులను కలిగివుంది. ఈ టీవీలు 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, మీరా క్యాస్ట్, Wi Fi, బ్లూటూత్ 5.0 మరియు వన్ ప్లస్ కనెక్ట్ 2.0 తో వస్తుంది.
0 Comments