Ad Code

తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపిన గూగుల్ !


యువతకు డిజిటల్ సర్టిఫికెట్‌ స్కాలర్‌షిప్‌లు, వారిని ఉద్యోగాలకు సిద్ధంగా చేయడమే లక్ష్యంగా ఇకపై తెలంగాణలో గూగుల్ పనిచేయనుంది. మహిళా వాణిజ్యవేత్తలకు మద్దతుగా ఉండేందుకు స్కిల్లింగ్ కార్యక్రమం ప్రారంభించనున్నారు. గూగుల్ ఫర్ ఎడ్యుకేషన్ ద్వారా పాఠశాలల ఆధునీకరణకు సాయం, తద్వారా విద్యార్థులకు మెరుగైన అభ్యాసన కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. గచ్చిబౌలిలో మూడు మిలియన్ల చదరపు అడుగుల భవన నిర్మాణానికి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఖాజాగూడలోని హెచ్ జిసిఎల్ ఆఫీస్ లో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో గూగుల్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా, గూగుల్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గూగుల్ 2017 నుంచి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది.'డిజిటల్ తెలంగాణ' అనే మా దార్శనికతకు మద్దతు ఇవ్వడానికి, ప్రతి పౌరుడు డిజిటల్‌ సాధికారత సాధించాలనే మా లక్ష్యాన్ని ముందుకు తీసుకురావడానికి గూగుల్ తన పరిష్కారాలను ఉపయోగించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. వారితో మేం ఇంతకు ముందు చేసుకున్న ఎంఓయూలు అన్ని వర్గాల పౌరులను సానుకూలంగా ప్రభావితం చేసిన కొన్ని గొప్ప కార్యక్రమాలకు దారితీశాయని ఆయన అన్నారు. అయితే ఈసారి యువత, మహిళలు, విద్యార్థులు, పౌరసేవల్లో మార్పు తీసుకురావడంపై దృష్టి సారించినట్టు కేటీఆర్ చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu