బ్రిటన్ రాజధాని లండన్‌లోని అమెరికా ఎంబసీ కార్యాలయం బయట ఒక అనుమానాస్పద ప్యాకేజీ కలకలం సృష్టించింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ద్వారా ప్యాకేజ్‌ను నిర్వీర్యం చేశారు. ఆ ప్యాకేజీ ఎక్కడినుంచి వచ్చిందనేదానిపై లండన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అమెరికా ఎంబసీ వెల్లడించింది. మరోవైపు గాట్విక్ ఎయిర్‌పోర్టులో భద్రతాపరమైన ఘటన ఇంకొకటి జరిగింది. దీంతో ఎయిర్‌పోర్టు దక్షిణ టెర్మినల్‌ను ఖాళీ చేయించామని అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే రష్యా- ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం నేపథ్యంలో మాస్కో, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలోని డిఫెన్స్ కంపెనీలపై రష్యా దాడులు చేసే అవకాశముందని ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.ఈ మేరకు నేషనల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సెంటర్ ఓ ప్రకటనను విడుదల చేసింది.
0 Comments