ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ అనుబంధ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ గడువు ముగిసింది. మొత్తం 2.55 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను అందుకుంది. 56 కోట్ల షేర్లకు గానూ మొత్తం 142 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. మొత్తం 22 లక్షల దరఖాస్తులు వచ్చాయి. క్యూఐబీ కోటా 3.51 రెట్లు సబ్‌స్క్రైబ్ అవగా.. ఎన్‌ఐఐ కోటా 85 శాతం సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. ఇక రిటైల్ కేటగిరీలో అత్యధికంగా 3.59 రెట్లు బిడ్లు దాఖలయ్యాయి. రూ.10వేల కోట్ల ఐపీఓలో ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.3,960 కోట్లను కంపెనీ సమీకరించింది. పూర్తి తాజా షేర్ల జారీ ద్వారా జరిగిన ఈ పబ్లిక్ ఇష్యూలో ధరల శ్రేణిని రూ.102-రూ.108గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణాలు, ముందస్తు చెల్లింపులకు వినియోగించనున్నారు. మరికొంత మొత్తం సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. నవంబర్ 25న షేర్ల అలాట్‌మెంట్ జరగనుంది. నవంబర్ 27న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో కంపెనీ నమోదు కానుంది.
0 Comments