Ad Code

అత్యధిక రేడియేషన్‌ను విడుదల చేసే ఫోన్లు !


రేడియేషన్ గురించి కూడా మనం వినే ఉంటాం. ఈ రేడియేషన్ ఎంత వరకు ఉండాలి? ఏ ఫోన్లలో ఎక్కువ ఉంటుంది? అనే సందేహాలు అందరికీ ఉంటాయి. 2జీ నుంచి 4జీ ఫోన్లలో 0.7 నుంచి 2.7 గిగా హెర్ట్జ్ వరకు రేడియేషన్స్ వస్తాయి. 5జీ ఫోన్లలో 80 హెర్ట్జ్ వరకు రానుందని తెలుస్తోంది. ఇప్పుడు ఎక్కువ రేడియేషన్ విడుదల చేసే ఫోన్ల జాబితాను ఒక రీసెర్చ్ సంస్థ విడుదల చేసింది. బ్యాంక్ లెస్ టైమ్స్ అనే సంస్థ ఈ రీసెర్చిని విడుదల చేసింది. ఈ జాబితాలో గూగుల్ పిక్సెల్, సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అయితే ఈ లిస్టింగ్ ప్రకారం ఎక్కువ రేడియేషన్ విడుదల చేసే ఫోన్లు ఇవే కాదు. స్పెసిఫిక్ అబ్జార్షన్ రేట్ (సార్) వాల్యూ ఆధారంగా ఈ రీసెర్చి చేశారు. సార్ వాల్యూని వాట్స్ పర్ కిలోగ్రాంల్లో కొలుస్తారు. ఈ జాబితాలో మొదటి స్థానంలో మోటొరోలా ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ ఉంది. ఈ ఫోన్ ఎక్కువ రేడియేషన్‌ను విడుదల చేస్తుంది. దీని సార్ వాల్యూ 1.79 W/Kgగా ఉంది. తర్వాతి స్థానంలో యాక్సాన్ 11 5జీ స్మార్ట్ ఫోన్ ఉంది. దీని సార్ వాల్యూ 1.59 W/Kg ఉంది. మూడో స్థానంలో ఉన్న వన్‌ప్లస్ 6టీ స్మార్ట్ ఫోన్ సార్ రేటింగ్ 1.55 W/Kgగా ఉంది. ఈ టాప్ -10 లిస్ట్‌లో నాలుగో స్థానంలో ఎక్స్‌పీరియా ఎక్స్ఏ2 ప్లస్, ఎనిమిదో స్థానంలో ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్1 కాంపాక్ట్ ఉన్నాయి. ఐదు, ఆరు స్థానాల్లో గూగుల్ పిక్సెల్ 3ఎక్స్ఎల్, గూగుల్ పిక్సెల్ 4ఏ ఉండగా... ఏడో స్థానంలో ఒప్పో రెనో 5 5జీ ఉంది. ఇక తొమ్మిదో స్థానంలో గూగుల్ పిక్సెల్ 3, పదో స్థానంలో వన్ ప్లస్ 6 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu