Ad Code

జనరల్‌ టికెట్ల బుకింగ్ !


జనరల్ బోగీల్లో టికెట్ తెచ్చుకోవాలంటే కష్టమే.. రైలు బయల్దేరే సమయంలోగా స్టేషన్ కు చేరుకోవాలి. గంటల కొద్ది క్యూలో నిలబడాలి. టైమ్ వృథా అవుతుంది. ఈ సమస్యను తొలగించేందుకు భారతీయ రైల్వే  అన్ రిజర్వడ్ టికెటింగ్ సిస్టమ్ మొబైల్ యాప్ తీసుకొచ్చింది. ఈ అప్లికేషన్ ద్వారా ఫోన్‌లో జనరల్ టికెట్లు, నెలవారీ సీజనల్ టికెట్లు, ప్లాట్ ఫారమ్ టికెట్లను ఈజీగా బుకింగ్ చేసుకోవచ్చు. గూగుల్‌ ప్లేస్టోర్‌, ఐఫోన్‌ యూజర్లు… యాప్‌ స్టోర్‌, విండోస్‌ ఫోన్‌ యూజర్లు.. విండోస్‌ యాప్‌ స్టోర్‌ నుంచి యూటీఎస్అ ప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోన్‌ నంబర్‌, పేరు, పాస్‌వర్డ్‌, పుట్టిన తేదీ వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. అప్పుడు మీకు వన్‌టైం పాస్‌వర్డ్‌ వస్తుంది. అంతే మీ టికెట్ బుకింగ్ ప్రక్రియ పూర్తయినట్టే. ఇప్పుడు మీరు చేయాల్సిందిల్లా రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక.. ఫోన్ నెంబర్, పాస్ వర్డ్‌తో మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. టికెట్‌ బుకింగ్‌ కోసం నార్మల్ ' ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఆన్‌లైన్‌ టికెట్‌ కోసం బుక్‌ అండ్‌ ట్రావెల్‌, ప్రింటెడ్‌ టికెట్‌ కోసం బుక్‌ అండ్‌ ప్రింట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ట్రైన్ ఎక్కే, దిగే స్టేషన్‌ల వివరాలను అందులో నమోదు చేసుకోవాలి. అలాగే ప్రయాణికులకు సంఖ్య, ట్రైన్‌ టైప్‌, ఏ క్లాస్‌ (సెకండ్ క్లాస్‌, అన్‌రిజర్వ్‌డ్‌) వంటి వివరాలను నమోదు చేయాలి.  'Payment Type'లో R-Wallet లేదా ఆన్‌లైన్‌ పేమెంట్‌ సిస్టమ్ (క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, డిజిటల్‌ పేమెంట్‌ యాప్స్‌) ఆప్షన్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మీ ట్రైన్ టికెట్‌లకు ఎంత చెల్లించాలో తెలుసుకోవాలి. అప్పుడు Book Ticket అనే ఆఫ్షన్ పై Click చేయాలి. అంతే మీ ట్రైన్ టికెట్‌ బుక్‌ అవుతుంది. ఒకవేళ మీరు బుకింగ్ చేసుకున్న టికెట్ చూడాలనుకుంటే.. 'Show Ticket' ఆప్షన్‌పై Click చేయాలి. మీ బుకింగ్ టికెట్‌ వివరాలు అక్కడ కనిపిస్తాయి. 'View Ticket'పై క్లిక్‌ చేస్తే ఆ టికెట్ కనిపిస్తుంది. 'Quick Booking' ఆప్షన్‌ ద్వారా బుక్‌ చేసుకున్న టికెట్‌ల వివరాలను నమోదు చేసుకోవాలి. 'Platform Booking' ద్వారా ప్లాట్‌ఫాం టికెట్‌ కూడా తీసుకునే అవకాశం ఉంది. సీజనల్‌ టికెట్స్‌ మాత్రమే కాదు.. నెలవారీ టికెట్‌ కూడా తీసుకోవచ్చు. అవసరమైతే రెన్యూవల్‌ కూడా చేసుకోవచ్చు. 'QR Booking' ఆప్షన్‌ ద్వారా స్టేషన్‌లోని టికెట్‌ కౌంటర్ల వద్ద QR Codeను Scan చేయడం ద్వారా టికెట్‌ పొందవచ్చు. ఆర్‌-వ్యాలెట్‌ ఆప్షన్‌ కోసం రీఛార్జ్‌ చేసుకోవాలి. రూ.100పై మాత్రమే రీఛార్జ్‌ వీలువుతుంది. ఆన్‌లైన్‌లో లేదా, స్టేషన్‌లోని UTS కౌంటర్‌ వద్ద రీఛార్జ్‌ చేసుకోవచ్చు. ముందుగా టికెట్ బుకింగ్ చేసుకోవడం కుదరదు. ప్రయాణించే రోజు మాత్రమే టికెట్‌ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్‌ తీసుకున్న గంటలోపే రైలు ఎక్కాల్సి ఉంటుంది. సెలెక్టెడ్ స్టేషన్లలో మాత్రమే ప్లాట్ ఫాం టికెట్ తీసుకోవడం వీలవుతుంది. పేపర్‌లెస్‌ టికెట్‌ రద్దు చేయలేం.. స్టేషన్‌ వెలుపల 5 కి.మీల పరిధిలో టికెట్‌ తీసుకునే వీలుంది. అదే స్టేషన్‌ లోపల ఉన్నా, రైల్లో ఉన్నా టికెట్ రద్దు చేయడం కుదరదు. అదే పేపర్ టికెట్ తీసుకుంటే.. స్టేషన్ దగ్గర ఏటీవీఎం/ కో-టీవీఎం, OCR Machines, OTS Booing Counter నుంచి టికెట్‌ Print తీసుకోవచ్చు. మీ ఫోన్‌ నంబర్‌, బుకింగ్‌ ID Number నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ టికెట్‌ రద్దు చేసుకునే వీలుంది. పేపర్ టికెట్‌ బుకింగ్ చేసుకుంటే.. తప్పకుండా టికెట్ చూపించాల్సి ఉంటుంది. లేదంటే ఫైన్ కట్టాల్సిందే.

Post a Comment

0 Comments

Close Menu