షియోమీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే షియోమీ సీవీ 1ఎస్. సెప్టెంబర్‌లో పరిచయం చేసిన సివి సిరీస్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. సెల్ఫీలను ఎక్కువగా ఇష్టపడేవారికి ఈ స్మార్ట్ ఫోన్ బెస్ట్ అని చెప్పవచ్చు. ముందువైపు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. 2x జూమ్, ఆటో ఫోకస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 4డీ లైట్ ఛేజింగ్ బ్యూటీ, నేటివ్ బ్యూటీ పొర్ట్రెయిట్ 2.0 టెక్నాలజీలను అందించారు. 'మిరాకిల్ సన్‌షైన్' డిజైన్‌తో ఈ ఫోన్ రూపొందించారు. ఈ ఫోన్ ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా దేశాల్లో లాంచ్ అవుతుందో లేదో తెలియరాలేదు. ఈ స్మార్ట్ ఫోన్లో మొత్తం మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,299 యువాన్లుగా (సుమారు రూ.27,100) ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,599 యువాన్లుగానూ (సుమారు రూ.30,700), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ 2,899 యువాన్లుగానూ (సుమారు రూ.34,200) నిర్ణయించారు. బ్లాక్, బ్లూ, పింక్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యమవుతుంది. 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ స్క్రీన్‌ను ఈ స్మార్ట్ ఫోన్లో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా... పీక్ బ్రైట్నెస్ 950 నిట్స్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. గతేడాది లాంచ్ అయిన షియోమీ సీవీ కంటే ఈ ఫోన్ 27 శాతం వేగంగా పనిచేయనుందని తెలుస్తోంది. 87.7 ఎఫ్‌పీఎస్ ఫ్రేమ్ రేట్‌తో ఈ ఫోన్ మూడు గంటల పాటు గేమింగ్ పెర్ఫార్మెన్స్ అందించనుంది. ఈ స్మార్ట్ ఫోన్లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 55W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. డాల్బీ అట్మాస్ టెక్నాలజీ ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఇందులో ఉన్నాయి. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే... ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ వీ5.2 ఐఆర్ రిమోట్ కంట్రోల్ టెక్నాలజీస్ కూడా ఇందులో ఉన్నాయి.
సెల్ఫీ లవర్స్ కు షియోమీ సూపర్ ఫోన్ !
by Telugu Lo Computer at April 21, 2022
Labels:
science
,
smart phones
,
technologe
,
ముందువైపు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
,
సెల్ఫీ లవర్స్ కు షియోమీ సూపర్ ఫోన్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment